న్యూస్ రౌండప్ టాప్ 20

1.బండి సంజయ్ తరుణ్ ఛుగ్ భేటీ

 తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో ఇన్చార్జి తరుణ్ చుగ్ గురువారం బిజెపి కార్యాలయంలో సమావేశమయ్యారు.

 

2.గర్భిణీలకు టోల్ ఫ్రీ నెంబర్

  కరోనా విపత్కర పరిస్థితుల్లో గర్భిణీలు బాలింతలు ఆరోగ్య విషయాలపై సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ బిర్జున్నిసా తెలిపారు.టోల్ ఫ్రీ నెంబర్ 180059912345 ద్వారా వైద్య సిబ్బందిని, గైనిక్ నిపుణులను సంప్రదించవచ్చన్నారు. 

3.13 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు సీజ్

   నకిలీ విత్తనాల ద్వారా దందా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.సూర్యాపేట జిల్లాలో దాడులు చేసి భారీ మొత్తంలో విత్తనాలను సీజ్ చేశారు వీటి విలువ 13 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 

4.నేడు బీజేపీ ముఖ్య నేతల భేటీ

  తెలంగాణలో పార్టీ పరిస్థితులపై చర్చించేందుకు గురువారం సాయంత్రం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా సమావేశం అవుతున్నారు. 

5.సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ బస్సులు

  లాక్ డౌన్ సడలింపు లో తెలంగాణలో ఇవ్వడంతో  ఈ రోజు నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు అమలు కానున్నాయి.దీంతో సాయంత్రం 6 గంటల వరకు యధావిధిగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

6.రేపటి నుంచి డిజిటల్ ల్యాండ్ సర్వే

  తెలంగాణలో వ్యవసాయ భూముల డిజిటల్ ల్యాండ్ సర్వే ఈనెల 11వ తేదీన ప్రారంభం కానుంది. 

7.జగన్ కు రఘురామ లేఖ

  ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.వృద్ధాప్య పెన్షన్లు పెంపు హామీని నిలబెట్టుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 250 పెన్షన్ పెంచాలని కోరారు. 

8.వృద్ధుల వ్యాక్సినేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

Advertisement

  ఏపీలో వృద్ధుల వ్యాక్సినేషన్ పై దాఖలైన మే 30 గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

9.ఏపీలో కర్ఫ్యూ సడలింపు

  ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ ను సదలించనున్నారు.రేపటినుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఇచ్చారు. 

10.డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉపాధ్యాయ పోస్టులు

  డీఎస్సీ-2008 ఉత్తీర్ణులైన అభ్యర్థుల పదమూడేళ్ల నిరీక్షణకు తెరపడింది .వారికి మినిమం టైం స్కేల్ ఇచ్చి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 

11.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది బుధవారం తిరుమల శ్రీవారిని 11,770 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 

12.బంగాళాఖాతంలో అల్పపీడనం

  అరేబియా సముద్రంలో నైరుతి గాలులు బలపడ్డాయి దీంతో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో తుని వరకు తెలంగాణలో భద్రాచలం, మహారాష్ట్ర, గుజరాత్ తో పాటు ఉత్తర బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి.ఈ ప్రభావంతో ఈ నెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. 

13.24 కోట్లు దాటిన టీకాల పంపిణీ

  దేశంలో కరోనా కు వ్యతిరేకంగా చేపట్టిన టీకా డ్రైవ్ లో ఇప్పటివరకు 24 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

14.వివేకా హత్య కేసులో మూడో రోజు సిబిఐ విచారణ

  మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ మూడో రోజు కూడా కొనసాగింది. 

15.జర్నలిస్టు రఘు కు మరో 14 రోజుల రిమాండ్

  నల్గొండ జిల్లా గుర్రంపొడు భూముల కేసులో జర్నలిస్ట్ రఘును మఠంపల్లి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

రఘు పై మటంపల్లి స్టేషన్లో మరో కేసు తెరపైకి తెచ్చి హుజూర్ నగర్ జైలు నుండి నల్గొండ జైలుకు తరలించారు.ఈ కేసులో వర్చువల్ ద్వారా విచారణ చేపట్టిన హుజూర్ నగర్ కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. 

16.ఢిల్లీ బయల్దేరి వెళ్లిన జగన్

Advertisement

  ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.ఈ రోజు రాత్రి 9 గంటలకు అమిత్ షా తో జగన్ భేటీ కాబోతున్నారు. 

17.బాలయ్యకు చిరు శుభాకాంక్షలు

  నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

18.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 94,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

19.ఘంటసాల కుమారుడు కన్నుమూత

  సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూసారు.గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ సమయంలోనే గుండెపోటుతో ఆయన మరణించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,880   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,880.

తాజా వార్తలు