ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ మృతి..!

దిగ్గజ గాయకుడు ఘంటసాల తనయుడు రత్నకుమార్ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల రత్నకుమార్ కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఈమధ్యనే కరోనా బారిన పడిన ఘంటసాల రత్నకుమార్ చికిత్స పొందగా రెండు రోజుల క్రితమే కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం.అయితే కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్న ఘంటసాల రత్నకుమార్ చెన్నై కావేరి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

బుధవారం రాత్రి నుండి పరిస్థితి విషమించిందని సమాచారం.డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సరే ఆయన్ను కాపాడలేకపోయారు.

ఘంటసాల రత్నకుమార్ కొన్నాళ్లుగా కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తుంది.డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Advertisement

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రత్నకుమార్ సౌత్ స్నీ పరిశ్రమలో తకనటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.సౌత్ బాషలన్నిటిలో పనిచేసిన ఆయన బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలకు గాత్రాన్ని అందిచారు.8 గంటల పాటు కంటిన్యూగా డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు.తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఇప్పటివరకు వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ఘంటసాల రత్నకుమార్.

తెలుగులో 30 సినిమాకు పైగా మాటలు కూడా అందించారు రత్నకుమార్.

Advertisement

తాజా వార్తలు