అబ్బాయిలా మారిపోయిన వర్షిణి.. ఏకంగా ఆమెతో గొడవ పడుతూ..?

బుల్లితెర యాంకర్ వర్షిణి ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఢీ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సంగతి విదితమే.

అయితే కొన్ని కారణాల వల్ల ఢీ షోకు దూరమైన వర్షిణి కామెడీ స్టార్స్ షోకు సోలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా వర్షిణి అబ్బాయి గెటప్ వేసుకుని ఒక వీడియో చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఓలేటి లక్ష్మీ పేరుతో ఒక వీడియో గత నెల రోజుల నుంచి వైరల్ అవుతోంది.

ఇప్పటికే ఓలేటి లక్ష్మీ పేరుతో జబర్దస్త్ షోలో స్కిట్లు కూడా చేశారు.వర్షిణి వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా వర్షిణి అమ్మాయిగా కంటే అబ్బాయి గెటప్ లోనే బాగున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.వర్షిణి ఈ వీడియోల ద్వారా తనలో ఉన్న టాలెంట్ ను నెటిజన్లకు పరిచయం అయ్యేలా చేస్తున్నారు.

అబ్బాయిలా షర్ట్ తొడుక్కుని బుక్ పట్టుకుని మీసాలు పెట్టుకుని వర్షిణి కనిపించారు.ఫోన్ కాల్ ను రీమిక్స్ చేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్న అధికారిలా వర్షిణి మాట్లాడటం గమనార్హం.

Advertisement

వర్షిణి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు తమ శైలిలో ఈ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు.ఓలేటి లక్ష్మితో గొడవ పడున్నట్టు వర్షిణి బాగా చేశారు.

మీసాలు పెట్టి అబ్బాయిలా సీరియస్ గా ఉంటూ వర్షిణి వీడియో చేయడం గమనార్హం.మరోవైపు సోషల్ మీడియాలో వర్షిణి తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.

తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వర్షిణి తన ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.రష్మీ, అనసూయలా వర్షిణి కూడా సినిమా ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.వర్షిణి ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు