ఆ బాధ్యతను భార్య చేతిలో పెట్టిన సుకుమార్..!

ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు.ఈయన రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

 Sukumar Wife To Manage Sukumar Writings, Sukumar, Sukumar Writings,sukumar Wife,-TeluguStop.com

అదే జోష్ లో లెక్కల మాస్టారు ఇప్పుడు పుష్ప సినిమా భారీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.ఒక పక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క సుకుమార్ నిర్మాణ సంస్థ కూడా స్థాపించాడు.

Telugu Sukumar, Sukumarmanage-Movie

ఆయన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ స్థాపించి ఆ నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తున్నాడు.ఆయన తన శిష్యులు చేసే సినిమాలను నిర్మిస్తూ హిట్స్ కూడా అందుకుంటున్నాడు.ఈ మధ్యనే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు.ఈ సినిమాను సుకుమార్ తన బ్యానర్ లో నిర్మించాడు.

అయితే సినిమాలతో బిజీగా ఉండే సుకుమార్ తన నిర్మాణ సంస్థ బాధ్యతలను తన స్నేహితుడు ప్రసాద్ నిర్వహించేవాడు.కానీ ఆయన మరణించడంతో ఆ బాధ్యతలను వేరే వారికీ అప్పగించాలని సుకుమార్ భావించి చివరకు తన భార్యకే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తుంది.ఆమె పలు వ్యాపారాలు చేస్తూ ఉండేది.

Telugu Sukumar, Sukumarmanage-Movie

కానీ కరోనా కారణంగా అవన్నీ వాయిదా పడ్డాయి.అందుకే సుకుమార్ తన బ్యానర్ పనులను భార్య చేతికే అప్పజెప్పినట్టు తెలుస్తుంది.ఇందులో ఆమెకు అనుభవం లేనందున కొన్నాళ్ల పాటు సుకుమార్ భార్య తబితకు గైడెన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయన బ్యానర్ పై నిఖిల్ హీరోగా రాబోతున్న 18 పేజెస్ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నాడు.ఇంకా కొన్ని సినిమాలు చర్చలు జరుగుతున్నాయి.

మొత్తానికి సుకుమార్ తన బ్యానర్ బాధ్యతను భార్యకు అప్పగించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube