మహేష్ బాబు- రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

సూపర్ స్టార్ మహేష్ బాబుతో, దర్శక దిగ్గజం రాజమౌళి మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.ఈ మూవీని ప్రముఖ నిర్మాత కె.

ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.

ఎప్పుడో ఈ మూవీకి సంబంధించి కమిట్ మెంట్ రాజమౌళి, మహేష్ బాబు నుంచి నిర్మాతకి వచ్చింది.బాహుబలి తర్వాత ఈ మూవీనే జక్కన్న స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు.

అయితే అనూహ్యంగా క్రేజీ మల్టీ స్టారర్ గా ఆర్ఆర్ఆర్ మూవీ తెరపైకి వచ్చింది.రాజమౌళి, రామ్ చరణ్, రామారావు కాంబినేషన్ అని వర్కింగ్ టైటిల్ గా ఆర్ఆర్ఆర్ అని పెట్టి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు.

Advertisement

అయితే ఈ టైటిల్ బాగుండటంతో ఫైనల్ గా దీనినే ఫైనల్ చేసేశారు.అన్ని బాషలలో ఇదే టైటిల్ తో సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.రామ్ చరణ్, తారక్ తో పాటు అజయ్ దేవగన్ అలియ భట్ లాంటి స్టార్ క్యాస్టింగ్, హాలీవుడ్ నటులు ఈ మూవీలో భాగం అయ్యారనే విషయం అందరికి తెలిసిందే.

దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని రాజమౌళి స్టార్ట్ చేస్తాడు.అయితే ఈ మూవీ కాన్సెప్ట్ పై చాలా కాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చత్రపతి శివాజీ పాత్రలో సూపర్ స్టార్ రాజమౌళి సినిమాలో కనిపించబోతున్నాడు అనే టాక్ వచ్చింది.అలాగే జేమ్స్ బాండ్ తరహా మూవీ కాన్సెప్ట్ సిద్ధం చేసారని ప్రచారం జరిగింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అలాగే మహాభారతం మూవీనే మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నారని చెప్పుకున్నారు.అయితే ఈ వార్తలపై నిర్మాత కె.ఎల్.నారాయణ క్లారిటీ ఇచ్చారు.జక్కన్న, రాజమౌళి సినిమా కథపై వస్తున్న వార్తలలో ఏదీ నిజం కాదని తేల్చేశారు.

Advertisement

అసలు ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు స్టొరీ లైన్ కూడా రెడీ కాలేదని స్పష్టం చేశారు.ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయిన తర్వాత మహేష్ తో జక్కన్న సినిమా ఉంటుందని, అయితే కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా అప్పుడే తెలుస్తుందని చెప్పారు.

రాజమౌళి ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లు కథకి సంబంధించి ఏది వాస్తవం కాదని తేల్చేశారు.

తాజా వార్తలు