అక్కడ అలాంటి వాళ్ళకి సపరేట్ రోడ్లు ఉంటాయట...

ప్రస్తుతం మానవ జీవితాలలో సెల్ ఫోన్ భాగమైపోయింది.ఎంతగా అంటే కొందరు సెల్ ఫోన్ లేకుండా జీవించడం కష్టమని పబ్లిక్ గా ఒప్పుకుంటున్నారు.

అయితే ఈ సెల్ ఫోన్ దూరాలను దగ్గర చేసినప్పటికీ ఈ మధ్య కాలంలో కొందరు సెల్ ఫోన్లకి బానిసలవుతున్నారు.ఇప్పటికే వాహనాలు నడిపే వారు సెల్ ఫోన్లను ఉపయోగిస్తూ వాహనం నడప రాదని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.

దీంతో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.కాగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు గాను ఆ దేశం ఓ నూతన పద్ధతిని అవలంబిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే చైనా దేశంలోని బీజింగ్ పట్టణంలో సెల్ ఫోన్లను ఉపయోగిస్తూ రోడ్లపై సంచరించే వారి కోసం ప్రత్యేకంగా లైన్లను ఏర్పాటు చేసి ఆ లైన్ల మీద మాత్రమే నడవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.ఒకవేళ సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన లైన్ లో కాకుండా ఇతర మార్గాల్లో నడిస్తే జరిమానా కూడా విధిస్తారు.

Advertisement

ఈ విషయంపై కొందరు ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మరియు రోడ్డు దాటడం వంటి వాటి కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అందువల్లనే సెల్ ఫోన్ మాట్లాడేవారికి సపరేట్ రహదారులను నిర్మించినట్లు తెలిపారు.

అయితే డూప్లికేట్ వస్తువులకి పెట్టింది పేరు చైనా దేశం.అంతేగాక ఈ దేశంలో డబ్బు ఉండాలి కానీ మనం చేయలేనిది ఏమీ ఉండదు.ఇందులో భాగంగా ఇక్కడ ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది.

ఆ రేటును మనం చెల్లించినట్లైతే నేరాలు చేసిన సరే మనకోసం ఇతరులు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు.అంతేకాక చైనా దేశం మార్కెట్లో డూప్లికేట్ కాని వస్తువు అంటూ ఏదీ ఉండదు.

ఇందులో భాగంగా ఏదైనా ఓ ప్రముఖ కంపెనీ బ్రాండెడ్ వస్తువుని మార్కెట్ లో రిలీజ్ చేసింది అంటే చాలు చైనా దేశీయులు వెంటనే దానిని కాపీ కొట్టి అతి తక్కువ ధరలో విడుదల చేస్తారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు