చికాకు పుట్టించే చుండ్రుకు అల్లంతో బై బై చెప్పేయండిలా?

చుండ్రు. కేవ‌లం స్త్రీల‌నే కాదు, పురుషుల‌ను కూడా ఎంతో చికాకు పెట్టే స‌మ‌స్య ఇది.

కాలుష్యం, ఆహార‌పు అల‌వాట్లు, త‌ల స్నానం చేయ‌క‌పోవ‌డం, ఫంగల్ ఇన్ ఫెక్షన్, తల్లోని నూనె గ్రంథులు స్రవించడం తగ్గిపోవడం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌నాల వ‌ల్ల చుండ్రు ఏర్ప‌డుతుంది.త‌ల‌లో చుండ్రు ఉండ‌టం వ‌ల్ల దుర‌ద‌, చికాకు పెరిగిపోతూ ఉంటాయి.

అందుకే ఈ చుండ్రును నివారించుకునేందుకు అనేక విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంది.అయితే చికాకు పుట్టించే చుండ్రుకు అల్లంతో గుడ్ బై చెప్పొచ్చు.

సాధార‌ణంగా అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని అంద‌రికీ తెలుసు.కానీ, కేశ సంర‌క్ష‌ణ‌లోనూ అల్లం ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా అల్లంలో ఉండే యాంటీ మోక్రోబియల్ లక్షణాలు చుండ్రుకు చెక్ పెట్ట‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.మ‌రి అల్లాన్ని జుట్టుకు ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా అల్లాన్ని శుభ్రం చేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ అల్లం పేస్ట్‌లో నిమ్మ ర‌సం మ‌రియు పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.అర గంట పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు ప‌రార్ అవుతుంది.అలాగే అల్లం నుంచి ర‌సం తీసుకుని అందులో తుల‌సి ఆకుల ర‌సం మ‌రియు నువ్వుల నూనె వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు పూసి.అర గంట లేదా గంట పాటు డ్రై అవ్వ‌నిచ్చి అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇలా వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు చేస్తే చుండ్రు రాలి పోతుంది.మ‌రియు జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు