జీ తెలుగు ఛానల్ బ్రాండ్ ఫిలాసఫీ ‘ఆరంభం ఒక్క అడుగుతోనే’.ఈ సూత్రాన్ని అనునిత్యం ఆచరిస్తూ అద్భుతమైన కార్యక్రమాలు రూపొందిస్తోంది.
ఇప్పుడు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ ‘వైదేహి పరిణయం‘ సీరియల్‌తో మీ ముందుకు వస్తోంది మే 31 నుంచి ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3:00 గంటలకి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీలలో.
రామ్, వైదేహి తీరానికి ఇరువైపులా ఉండేవారు.
వారు అకస్మాత్తుగా భార్యాభర్తలుగా మారితే? ఆ పయనం ఎలా ఉంటుంది? రామ్ (పవన్ రవీంద్ర) తన అన్నయ్య జీవితం చూసి పెళ్లే వద్దు అనుకుంటాడు.అలాంటి పవన్ జీవితంలోకి వైదేహి (యుక్త మల్నాడ్) ప్రవేశిస్తే, జీవితం ఇచ్చిన ఆ అవకాశాన్ని ఒప్పుకుంటాడా లేదా జాడవిరుచుకుంటాడా? తెలియాలంటే ‘వైదేహి పరిణయం’ చూడాల్సిందే.
జీ తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, “ఆరంభం ఒక్క అడుగుతోనే అనే మా ఛానల్ సిద్ధాంతానికి అనుగుణంగా ‘వైదేహి పరిణయం’ ధారావాహికను మే 31 వ తేదీ నాడు అందరి ముందుకు తీసుకొస్తున్నాం.జీవితం రెండో అవకాశం ఇస్తే ఏ విధంగా ధైర్యంగా కొత్త ఆరంభానికి స్వాగతం పలుకుతారో తెలియాలంటే ఈ మధ్యాహ్నపు ధారావాహికను వీక్షించాల్సిందే.
ప్రగతి మార్గంలో నడిపించే కథలనే జీ తెలుగు ఎల్లప్పుడూ ప్రజలకు అందిస్తుంది.ఈ సీరియల్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.”
జీవితం కల్పించే ఈ అవకాశాన్ని ఏ విధంగా ఈ జంట చేజిక్కించుకుంటారో తెలియాలంటే ‘వైదేహి పరిణయం’ మే 31 నుండి మధ్యాహ్నం 3 : 00 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో తప్పక వీక్షించండి.
ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.
మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.
జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.
మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
జీ తెలుగు గురించి
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.
ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.
అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.
సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.
అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.