బెడ్ రూమ్ పిక్ ను షేర్ చేసిన మోనాల్... నా పరిస్థితి ఇలా ఐందంటూ...

బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఎందుకంటే బిగ్ బాస్ అనేది బుల్లితెర ప్రేక్షకులకు అతి పెద్ద ఎంటర్ టైన్ మెంట్ అని చెప్పవచ్చు.

కరోనా మొదటి వేవ్ సమయంలో అందరూ లాక్ డౌన్ లో ఉన్న సమయంలో బిగ్ బాస్ తో ప్రేక్షకులకు కొద్దిగా ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.అయితే బిగ్ బాస్ తో సాధారణ నటులకు స్టార్ స్టేటస్ వచ్చి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు.

అలా అంతకు ముందు రకరకాల సినిమాలలో నటించినా బిగ్ బాస్ తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొన్న నటి మోనాల్ గజ్జర్.తెలుగు భామ కాకపోయినా కొంచెం కొంచెం తెలుగును క్యూట్ గా మాట్లాడుతూ, మరో బిగ్ బాస్ కంటిస్టెంట్ అఖిల్ తో లవ్ ఎఫైర్ అని కొంత బలమైన ప్రచారంతో ఒక్కసారిగా ప్రేక్షకులకు దగ్గరయింది మోనాల్.

బిగ్ బాస్ తరువాత ఇప్పుడిప్పుడే పలు సినిమాలలో కూడా నటిస్తోంది మోనాల్.ఇటు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్న మోనాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

Advertisement

తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బెడ్ రూమ్ ఫోటోను షేర్ చేసిన మోనాల్ నా పరిస్థితి ఇలా ఐందంటూ క్యాప్షన్ జత చేసింది.అయితే అసలు విషయం ఏంటంటే మోనాల్ నైట్ ఫోటో షూట్ చేస్తోంది.

అయితే నైట్ సమయంలో కూడా వర్క్ చేస్తున్నా నా పరిస్థితి ఇలా అయిపోయిందంటూ తన బాధను తెలిపింది మోనాల్.

Advertisement

తాజా వార్తలు