టాలీవుడ్ హీరోయిన్ గ్లామర్ బ్యూటీ సమంత అక్కినేని.ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
స్టార్ లిస్టులో చేరింది.తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో నటించింది.
అక్కడ కూడా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత.ఇప్పటి వరకు బాలీవుడ్ అవకాశాలు వచ్చినా కూడా వదులుకుంది.ఇక పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలలో దూసుకుపోతుంది.
ఇటీవలే రాజ్ డి.కె దర్శకత్వం లో ‘ది ఫ్యామిలీ మెన్ 2‘ అనే వెబ్ సిరీస్ లో నటించింది.ఇక ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంతో సమంత కు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.అంతే కాకుండా ఈ సిరీస్ డైరెక్టర్ రాజ్ డి.కె కూడా సమంత కోసం హిందీలో ఓ సినిమా చేయడానికి కూడా ఒకే అంటున్నారట.పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా సమంత కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ మీడియా తో కొన్ని విషయాలు పంచుకుంది సమంత.తనకు గతంలో బాలీవుడ్ అవకాశాలు వచ్చాయని, చాలా సినిమా కథలు తన ముందుకు వచ్చాయని తెలిపింది.
కానీ తను టాలీవుడ్ లో బిజీగా ఉండటంవల్ల మరో ఛాన్స్ తీసుకోలేదట.కొన్నిసార్లు కథలు నచ్చిన కూడా డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేనని తెలిపింది.

కాని తనకు బాలీవుడ్ లో చేయాలనే కోరిక మాత్రం ఉందట.మామూలుగా బాలీవుడ్ ఎంట్రీకి తనకు కాస్త ఆలస్యం కావడానికి కారణం మరొకటి ఉందని తెలిపింది.బాలీవుడ్ వాళ్లకు టాలెంట్ ఎక్కువ అంటూ, అందుకే భయపడి రాలేనని తెలిపింది.కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నానంటూ.తన టాలెంట్ చూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది.ఒకవేళ తను బాలీవుడ్ లో నటించాలనుకుంటే.
రణ్బీర్ కపూర్ తోనే నటిస్తానని, తనంటే ఇష్టమని, అతడితో కలిసి జంటగా నటించాలని ఉందని తెలిపింది.