కాలేయంలో పేరుకుపోయిన‌ కొవ్వును క‌రిగించే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

కాలేయంలో కొవ్వు పేరుకు పోవ‌డం దీనినే ఫ్యాటీ లివ‌ర్ అని పిలుస్తారు.

ఆల్క‌హాల్ సేవించ‌డం, పోష‌కాల లోపం, ఓబేసిటి, డయాబెటిస్, ఆహార‌పు అల‌వాట్లు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కాలేయంలో కొవ్వు పేరుకుంటుంది.

దీనిని నిర్ల‌క్ష్యం చేస్తే.జీవక్రియల మీద ప్రభావం ప‌డి ప్రాణాంత‌కంగా మారుతుంది.

అయితే ఫ్యాటీ లివ‌ర్‌ను ఎంత త్వ‌ర‌గా నివారించుకుంటే అంత మంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతారు.అయితే కాలేయంలోని కొవ్వును క‌రిగించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి అవేంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఫ్యాటీ లివ‌ర్ వ్యాధితో బాధ ప‌డే వారు బొప్పాయి పండు ఎంతో మంచిది.

Advertisement

బొప్పాయి పండులో ఉండే ప‌లు పోష‌కాలు కాలేయంలో కొవ్వును క‌రిగించేస్తుంది.అందువ‌ల్ల‌, రోజుకు ఒక క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తినాలి.

అలాగే ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ కూడా ఫ్యాటీ లివ‌ర్ వ్యాధిని త‌గ్గిస్తుంది.ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక గ్లాస్ ఆయిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి మిక్స్ చేసుకుని సేవించాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.ఉసిరికాయ కూడా కాలేయంలో పేరుకు పోయిన కొవ్వును క‌రిగిస్తుంది.

తాజా ఉసిరి కాయ రసం లో కొంచెం స్వ‌చ్ఛమైన తేనె కలిపి తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ దూరం అవుతుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ప‌సుపు క‌లిపిన పాలు కూడా కాలేయ కొవ్వును త‌గ్గిస్తుంది.ప్ర‌తి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు క‌లిపి తీసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Advertisement

ఇక వీటిలో పాటుగా ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండాలి.బ‌రువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.

ప్ర‌తి రోజు క‌నీసం ఇర‌వై నిమిషాలైనా వ్యాయామాలు చేయాలి.వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.

కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలకు మరియు షుగర్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.తాజా పండ్లు, ఆకుకూర‌లు, కాయ‌గూర‌లు తీసుకోవాలి.

మాంసాహారాన్ని తిన‌డం త‌గ్గించాలి.

తాజా వార్తలు