యూకే: ఆక్స్‌ఫ‌ర్డ్ స్టూడెంట్ యూనియ‌న్ ప్రెసిడెంట్‌గా... మళ్లీ భార‌తీయురాలికే పట్టం

ప్రఖ్యాత ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ స్టూడెంట్ యూనియ‌న్ ప్రెసిడెంట్‌ ఉప‌ ఎన్నిక‌లో మరోసారి భారతీయురాలికే విద్యార్ధులు పట్టం కట్టారు.మేగ్డాలేన్ కాలేజీలో హ్యూమ‌న్ సైన్స్ చ‌దువుతున్న‌ భార‌త సంత‌తి విద్యార్ధిని అవ‌నీ భుతానీ ప్రెసిడెంట్‌గా విజ‌యం సాధించారు.

2021-22 విద్యా సంవ‌త్స‌రానికి గాను జ‌రిగిన‌ స్టూడెంట్ యూనియ‌న్ ప్రెసిడెంట్ ఉప ఎన్నిక ఫ‌లితాన్ని గురువారం అర్థ‌రాత్రి ప్ర‌క‌టించారు.ఈ ఎన్నిక‌లో మొత్తం 11 మంది అభ్య‌ర్థులు తమ అదృష్టాన్నీ పరీక్షించుకున్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్శిటీ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా 2,506 మంది త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోవడం విశేషం.కాగా, తొలుత ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ స్టూడెంట్ యూనియ‌న్ ప్రెసిడెంట్‌గా భార‌త్‌కు చెందిన ర‌ష్మీ స‌మంత్ గెలిచారు.

కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.అధ్యక్ష పదవికి ఎన్నిక కాక ముందు రష్మీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవ్వడంతో రాజీనామాకు దారి తీశాయి.

Advertisement

తన సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు జాత్యాహంకారమైనవిగా, అతి సున్నితమైనవిగా విమర్శలు వచ్చాయి.

అలాగే మహిళలు, లింగ మార్పిడి చేసుకున్నవారు (ట్రాన్స్ వుమెన్) ని వేరుగా చూడాలంటూ ఆక్స్‌ఫర్డ్ ఎల్జీబీటీక్యూ+ పేరిట రష్మీ చేసిన పోస్ట్ ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.దీనితో పాటు చైనా విద్యార్థుల పట్ల రష్మి చేసిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి .ఈ పరిణామాల నేపథ్యంలో రష్మీని రాజీనామా చేయాల్సిందిగా పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు.దీంతో తప్పని పరిస్థితిలో ఆమె రాజీనామా చేశారు.

ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు.తన మేనిఫెస్టోపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన విద్యార్థులందరికీ రష్మీ ధన్యవాదాలు తెలిపారు.

తన చర్యలతో, తన వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకుని ఉంటే తనను క్షమించాలని రష్మీ ఓ ప్రకటనలో కోరారు.కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన రష్మి సమంత్ ఉన్నత విద్యాభ్యాసం కోసం యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మార్చినెలలో అక్కడ జరిగిన ఎన్నికల్లో పాల్గొని స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు.

Advertisement

ఆమె ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం అనుబంధ లినాక్రే కాలేజీలో ఎంఎస్సి ఇన్ ఎనర్జీ సిస్టమ్స్ కోర్సు అభ్యసిస్తున్నారు.స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి మొత్తం నలుగురు పోటీ చేయగా.

మిగతా ముగ్గురిని దాటుకుని రష్మి సమంత్‌ విజయం సాధించారు.

తాజా వార్తలు