ఈ రీఛార్జ్ మాస్క్ అతి సురక్షితం.. సౌకర్యవంతం..!

దేశంలో క‌రోనావైర‌స్ దూకుడు పెంచేసింది.క‌రోనా క‌ట్ట‌డికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ల‌క్ష‌ల్లో కేసులు వ‌స్తున్నాయి.

గాలి ద్వారా కూడా ఇప్పుడు క‌రోనా వ్యాప్తి చెందుతోంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా రాకుండా ఉండాలంటే కేవ‌లం ఒక్క మాస్క్ పెట్టుకుంటే స‌రిపోదా లేక రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాల్సిందేనా అనే దానిపై పరిశొధనలు జరుగుతున్నాయి.

రెండు మాస్కుల‌ను వాడ‌టం వ‌ల్ల క‌రోనా వైర‌స్ క‌ణాలు ముక్కు, నోటి ద్వారా శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌లేవని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.బ‌ట్ట మాస్క్‌తో పాటు స‌ర్జిక‌ల్ మాస్క్‌ను ధ‌రించ‌డం వ‌ల్ల రెండు క‌లిపి మ‌న మొఖానికి ప‌ట్టేసిన‌ట్టు.

బిగుతుగా ఉంటాయి.దీనివ‌ల్ల వైర‌స్ క‌ణాల‌ను అడ్డుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది.

Advertisement

సాధార‌ణంగా వైర‌స్ క‌ణాల‌ను అడ్డుకోవ‌డంలో స‌ర్జిక‌ల్ మాస్కులు 40 నుంచి 60 శాతం స‌మ‌ర్థ‌త‌ను క‌లిగి ఉంటాయి.బ‌ట్ట‌తో త‌యారైన మాస్కులు 40 శాతానికి పైగా స‌మ‌ర్థ‌త‌ను క‌లిగి ఉంటాయి.

కరోనాను అంతం చేయడానికి మాస్కులపై చాలా మందే పరిశోధనలు చేస్తూ రకరకాల మాస్కులను తయారు చేస్తున్నారు.దీనివల్ల సమాజానికి కరోనాను కట్టడి చేసే ఓ సరికొత్త మాస్కు కోసం అన్వేషిస్తున్నారు.తాజాగా ఖమ్మం నగరం సారథినగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి సోమయ్య రీఛార్జి బ్యాటరీతో పనిచేసే మాస్క్‌ ధరించడం చర్చనీయాంశమైంది.

చాలా మంది ఖరీదైన మాస్కులు ధరించైనా సరే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చూస్తున్నారు.వివిధ రకాల సురక్షితమైన మాస్కులను కొనుగోలు చేస్తూ కరోనా నుంచి రక్షణ పొందుతున్నారు.

ఖమ్మంలో ఈ పెద్దాయన ధరించిన మాస్కు కూడా ఓ విభిన్నమైనదని, ఇది ఎంతో సురక్షితంగా సౌకర్యవంతంగా ఉందని తెలిపారు.ఈ మాస్కుకు చిన్న పైపు ద్వారా గాలి సరఫరా ఉంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

వాతావరణంలో ఎలాంటి వాయు కాలుష్యమున్నా ఇట్టే శుద్ధి చేసి లోనికి పంపిస్తుందని ఆయన తెలుపుతున్నారు.నడిచినా, మెట్లు ఎక్కినా శ్వాసలో ఎలాంటి తేడా రానివ్వకపోవడం మరో విశేషమని, ఇది చాలా సుఖంగా ఎటువంటి ఇబ్బందినీ కలిగించకుండా ఉందని తెలుపుతున్నారు.మార్కెట్లో ఈ మాస్కు కేవలం రూ.5 వేలకు కొనుగోలు చేసినట్టు ఆయన ఈ సందర్బంగా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు