1.మల్లారెడ్డి కొవిడ్ కేర్ లో ఉచిత వైద్య సేవలు
హైదరాబాద్ మల్లారెడ్డి ఆసుపత్రి సౌజన్యంతో మల్లారెడ్డి కోవేట్ లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.స్వల్ప లక్షణాలు కలిగిన, పాజిటివ్ వచ్చిన 15 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వారు ఇక్కడ వైద్య సేవలు పొందవచ్చు అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
2.కరోనా కిట్లు అందించిన బాలకృష్ణ
ప్రముఖ సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గంలోని బాధితులకు పంపించారు .
3.లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

కూకట్ పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు.బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నిన్న రవీందర్ రెడ్డి 100 మందితో జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించకుండా నిర్వహించిన ఈ వేడుకల్లో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.
4.మహారాష్ట్ర లో లాక్ డౌన్ పొడిగింపు
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది.
దేశంలో ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి .ఈ నేపథ్యంలో జూన్ 1 వ తేదీ ఉదయం ఏడు గంటల వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
5.దేశవ్యాప్తంగా రేపే ఈద్

ఈద్ – ఉల్ – ఫితర్ దేశ వ్యాప్తంగా శుక్రవారం జరగనుంది.బుధవారం నెలవంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్ ఉపవాస దీక్షను కొనసాగించాలని, 14వ తేదీన ఈద్ జరుపుకోవాలని రువాయత్ -ఎ – హిలాల్ కమిటీ, ఢిల్లీలోని జామియా మసీదు ఇమామ్ తో పాటు పలువురు మతపెద్దలు ప్రకటించారు.
6.సంగం డైరీ లో సోదాలపై వారెంట్ రీకాల్ పిటిషన్
సంగం డైరీ లు సోదరులపై డైరీ న్యాయవాదులు వారెంట్ రీ కాల్ పిటిషన్ దాఖలు చేశారు.
7.ఏపీలో కోవిడ్ కేసులపై హై కోర్టు లో పిటిషన్
ఏపీలో కోవిడ్ కేసుల పెరుగుదల, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.ఆల్ ఇండియా లాయార్స్ యూనియన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
8.ఈ పాస్ ల కోసం 15 వేల దరఖాస్తులు

లాక్ డౌన్ సమయంలో అత్యవసరంగా బయటకు వెళ్లే వారి కోసం పోలీస్ శాఖ జారీ చేస్తున్న ఈ పాస్ ల కోసం మొదటి రోజే తెలంగాణ వ్యాప్తంగా 15 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
9.పోలీసు వారి ‘ ప్రాజెక్ట్ ఆశ్రయ్ ‘
హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరో సహాయానికి శ్రీకారం చుట్టారు.
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు కంపెనీల సహకారంతో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.దీనికి ప్రాజెక్ట్ ఆశ్రయ్ అని పేరు పెట్టారు.
10.ఏపీ లో కరోనా
గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా 21,452 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.ఇద్దరు బెంగాల్ బిజెపి ఎమ్మెల్యే ల రాజీనామా

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల పోటీ చేసి బిజెపి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నిషిత్ ప్రమాణిక్ , జగన్నాథ్ సర్కార్ లు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు.
12.జర్నలిస్ట్ లకు సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్
కరోనా పరిస్థితుల నేపథ్యంలో జర్నలిస్ట్ ల కోసం సుప్రీం కోర్టు ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.ఈ యాప్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ ప్రారంభించారు.
13.టిఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయం

ఇటీవల కరోనా కారణంగా మరణించిన టీవీ జర్నలిస్టు టిఎన్ ఆర్ ఇటీవల కరోనా తో మరణించడం తో దర్శకుడు మారుతి స్పందించి 50 వేలను తక్షణ సాయంగా అందించారు.
14.పంటల భీమా నిధుల విడుదల
వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పధకం కింద ఖరీఫ్ 2020 సీజన్ కి సంబంధించి అర్హులైన రైతులకు పంటల భీమా కింద 2,586.60 కోట్లను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు.
15.మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు పితృ వియోగం

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస్ కు పితృ వియోగం కలిగింది.ఆయన తండ్రి సూర్యనారాయణ అనారోగ్యం తో మరణించారు.
16.సూరత్ లో 55 బ్లాక్ ఫంగస్ కేసులు
గుజరాత్ లోని సూరత్ లో 55 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
17.కూలీ ప్రాణం తీసిన పెంపుడు కుక్క
నిర్మాణ స్థలంలో మెట్ల కింద నిద్రిస్తున్న కూలి పై యజమాని పెంపుడు కుక్క దాడి చేయడంతో నరసింహ అనే కూలి తీవ్రంగా గాయపడి మరణించిన సంఘటన బెంగుళూరులోని అత్త్తూర్ లే అవుట్ లో చోటు చేసుకుంది.
18.సుప్రీం కోర్టు ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధం : సీజేఐ
సుప్రీం కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం లకు తాము సిద్ధంగా ఉన్నట్లు భారత న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
19.పిఎం కిసాన్ నిధి విడుదల 14 న

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఎనిమిదో విడత ఆర్థిక సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 14 న విడుదల చేస్తారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,720
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,720.