శ్రీ రెడ్డి ని ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్... దాంతో ఏకంగా....

ఎలాంటి విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ముక్కు సూటిగా సమాధానాలిస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న తెలుగు ప్రముఖ నటి "శ్రీ రెడ్డి" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే నటి శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అవుతోంది.

దీంతో ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకొని మెగా హీరోలను టార్గెట్ చేస్తోంది.ఐతే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందినటువంటి ఓ ఎంపీ అనుకోకుండా పార్టీలో విభేదాలు రావడంతో జగన్ మోహన్ రెడ్డి మరియు ఇతర పార్టీ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కొంతమేర పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.

దీంతో శ్రీ రెడ్డి ఆ ఎంపీ పై సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ కూడా ఘాటుగా విమర్శలు చేస్తోంది.

అయితే తాజాగా ఆ ఎంపీ కి సంబంధించినటువంటి ఓ పోస్ట్ ను షేర్ చేసింది.దీంతో నెటిజన్ శ్రీ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని అడిగాడు.

Advertisement

దాంతో శ్రీ రెడ్డి ఈ విషయం పై స్పందిస్తూ తన చేతులు ఖాళీ లేవని పక్కకు వెళ్ళమంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.దీంతో ఒక్కసారిగా ఆ నెటిజన్ అవాక్కయ్యాడు.

అయితే మరోవైపు కొందరు శ్రీరెడ్డి నెగిటివ్ అభిమానులు మాత్రం శ్రీ రెడ్డి వ్యాఖ్యలని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.మరికొందరైతే నిన్న మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లను టార్గెట్ చేసింది.

ఇప్పుడేమో వైకాపా నేతపై సంచలన వ్యాఖ్యలు చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నటి శ్రీ రెడ్డి తెలుగులో "క్లైమాక్స్" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది.దీంతో ఈ అమ్మడికి ఈ చిత్రం పెద్దగా కలిసి రాలేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయితే తాజాగా శ్రీ రెడ్డి తన జీవిత ఆధారంగా బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు శ్రీ రెడ్డి మాత్రం ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

తాజా వార్తలు