చెవి నొప్పి వేధిస్తుందా.. తుల‌సితో ఇలా చేస్తే నొప్పి బ‌హుప‌రార్‌?

చెవి నొప్పి దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఎదుర్కొనే స‌మ‌స్యే ఇది.

చెవి నొప్పి అనేది చిన్న స‌మ‌స్యే అని చాలా మంది భావిస్తారు.

కానీ, దాన్ని అనుభ‌వించే వారి బాధ వ‌ర్ణ‌ణాతీతం.కూర్చున్నా న‌ర‌క‌మే, నుంచున్నా న‌ర‌క‌మే.

కాసేపైనా ప్ర‌శాంతంగా ఉండ‌లేరు.ప‌క్క‌ని వారితో స‌ర‌ద‌గా మాట్లాడ‌నూ లేరు.

పోని నిద్ర అస్స‌లు రాదు.అంత‌లా చెవి నొప్పి విసిగిస్తుంది.

Advertisement

ఇక ఏం చేయాలో తెలియ‌క ఈ నొప్పిని త‌గ్గించుకునేందుకు పెయిన్ కిల్ల‌ర్స్ వాడ‌తారు.కానీ, ఇంట్లోనే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే ఎటువంటి పెయిన్ కిల్ల‌ర్స్ వాడ‌కుండానే నొప్పిని నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో చూసేయండి.చెవి నొప్పినికి చెక్ పెట్ట‌డంలో తుల‌సి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

గొప్పెడు తుల‌సి ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా దంచి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సాన్ని చెవిలో వేస్తే క్ష‌ణాల్లోనే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

మ‌రియు చెవిలో ఏమైనా ఇన్ఫెక్ష‌న్ ఉన్నా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అలాగే ఆలివ్ ఆయిల్ కూడా చెవి నొప్పిని నివారిస్తుంది.ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి.ఇప్పుడు ఈ ఆయిల్ గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత చెవిలో రెండు లేదా మూడు చుక్క‌లు వేసుకోవాలి.

Advertisement

ఇలా చేస్తే వెచ్చదనం వ‌ల్ల నొప్పి త‌గ్గుతుంది.చెవి నొప్పిని త‌గ్గించ‌డంలో ఉప్పు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.ఒక గిన్నెలో ఉప్పు వేసి లేట్‌గా వేయించి ఒక కాట‌న్ క్లాత్‌లో చుట్టుకోవాలి.

ఇప్పుడు ఈ ఉప్పు మూట‌తో నొప్పి ఉన్న చెవి చుట్టూ కాపడం పెట్టుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

అయితే ఇలా కాప‌డం పెట్టుకున్న‌ప్పుడు ఉప్పు మ‌రీ వేడిగా ఉంటే చ‌ర్మంపై బొబ్బ‌లు వ‌చ్చేస్తాయి.కాబ‌ట్టి, ఉప్పును చాలా లైట్‌గా మాత్ర‌మే వేడి చేయాలి.

తాజా వార్తలు