వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు మేయర్ల ఎన్నిక.. మహిళలకే ప్రాధాన్యత.. !

ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కాగా ఈ ఎన్నికల్లో మహిళలకు అధికప్రాధాన్యత ఇచ్చారు.

ఈ నేపధ్యంలో ఇక్కడి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది.ఇక వరంగల్ 29వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన గుండు సుధారాణిని మేయర్ గా ప్రకటించగా, వరంగల్ 36వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన రిజ్వానా ష‌మీమ్ ను డిప్యూటీ మేయ‌ర్‌ గా మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసి ప్ర‌క‌టించారు.

మరోవైపు ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను కూడా అధిష్టానం ఖ‌రారు చేసింది.వీరిలో ఖమ్మం 26వ డివిజ‌న్ కార్పొరేటర్ గా గెలిచిన పునుకొల్లు నీర‌జ‌ ను మేయ‌ర్‌ గా, 37వ డివిజ‌న్ కార్పొరేటర్ గా గెలిచిన ఫాతిమా జోహ్రో ను డిప్యూటీ మేయ‌ర్‌ గా మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.

ఇకపోతే ఈ ఎన్నికల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో ఏదో వ్యూహం తప్పక ఉందనే విషయం అర్ధం అవుతుందని కొందరు అనుకుంటున్నారట.

Advertisement
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

తాజా వార్తలు