జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 144 సెక్షన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పెరిగిపోతుండటంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తూ ఉంది.

రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు.అయితే కొత్త కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ విధించడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది.

ఈ నేపథ్యంలో మే 5వ తారీఖు నుండి మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుండి కర్ఫ్యూను అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగిందట.ఈ నిర్ణయంతో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునే పరిస్థితి.

ఉదయం పూట పరిధిలో మాత్రమే కాక రాష్ట్రంలో 144 సెక్షన్ కూడా అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దాదాపు రెండు వారాల పాటు ఈ విధంగా కరోనా ఆంక్షలు విధించాలని .రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది.ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు దుకాణాలు.

Advertisement

తెరిచి ఉన్న సమయం లోనే 144 సెక్షన్ అమల్లోకి రానున్నట్లు సమాచారం. .

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు