ఆ రీమేక్ లో చిరంజీవి నాగార్జున.. ఫ్యాన్స్ కు పండగే..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుంది.మల్టీస్టారర్ సినిమాలకు రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడంతో భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.

ఈ ఏడాది విడుదల కాబోతున్న ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు మల్టీస్టారర్ సినిమాలనే సంగతి తెలిసిందే.అయితే తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన విక్రమ్ వేద సినిమా రీమేక్ కు సంబంధించి గత కొన్నేళ్లుగా ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ రీమేక్ లో చిరంజీవి నాగార్జున కలిసి నటించనున్నారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.ఈ వార్తలో నిజానిజాలు తెలియకపోయినా చిరంజీవి, నాగార్జున ఒకే సినిమాలో నటిస్తే మాత్రం ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

లారెన్స్ హీరోగా నటించిన స్టైల్ సినిమాలో చిరంజీవి, నాగార్జున స్పెషల్ రోల్స్ లో నటించినా ఇద్దరి కాంబినేషన్ లో మాత్రం ఎలాంటి సీన్లు లేకపోవడం గమనార్హం.

Advertisement

తమిళంలో విక్రమ్ వేద సినిమాలో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించారు.విక్రమ్ వేదలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ కాగా విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా నటించారు.ఈ సినిమా తమిళంలో ఏకంగా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం గమనార్హం.

గతంలో పవన్ కళ్యాణ్ రవితేజ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలు నిజం కాలేదు.చిరంజీవి, నాగార్జున విక్రమ్ వేద రీమేక్ లో నటిస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

మరి ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.నాగార్జున ఇప్పటికే పలు మల్టీస్టారర్ సినిమాలలో నటించినా చిరంజీవి మాత్రం మెగా ఫ్యామిలీ హీరోలతో మాత్రమే కలిసి ఎక్కువగా నటిస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు