వైరల్: నవ వధువును అత్తారింటి తీసుకువెళ్లడానికి ఏకంగా..?!

కరోనా భూతం జడలు విప్పి నాట్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు గుమికూడడంపై ఎక్కడిక్కడ ఆంక్షలు విధిస్తున్నారు.

పరిమిత సంఖ్యలో ప్రజలతోనే వేడుకలు జరపుకోవాలని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి.

పలు చోట్ల ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఇటువంటి నేపథ్యంలో పెళ్లిళ్లు చేసుకోవడం గగనంగా మారింది.

సాదాసీదాగా పెళ్లితంతు ముగించేస్తున్నారు.ఏదో చేశాం అంటే చేశాం అనే రీతిలో పెళ్లిని జరిపించేస్తున్నారు.

ఇటువంటి పరిస్థితుల మధ్య ఓ యువకుడు పెళ్లి కూతురు కోరిక మేరక హెలికాప్టర్ లో అత్తారింటికి తీసుకెళ్లాడు.పెళ్లి వేడుకలను వెరైటీగా ప్లాన్ చేశారు.

Advertisement

మొదటిసారి అత్తగారి ఇంటికి హెలికాప్టర్‌లో వెళ్లాలనే తన భార్య కలను అతడు నిజం చేశాడు.ఈ ఘటన రాజస్థాన్‌లో రాష్ట్రంలోని భరత్‌పూర్ జిల్లాలో రాయ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

సియారామ్ గుర్జార్ అనే వ్యక్తి ఇటీవల పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లి తరువాత అత్తగారి ఇంటికి.

తన భార్య కోరిక మేరకు వరుడు ఒక ఛాపర్‌ను అద్దెకు తీసుకున్నాడు. సోమవారం తన అత్తమామల గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లాడు.

అక్కడ ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.ఆ తరువాత తన భార్యను అదే చాపర్‌లో మంగళవారం తన గ్రామానికి తీసుకువచ్చాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

సియారామ్‌ది ఒక సాధారణ రైతు కుటుంబం.అతడికి నాద్బాయిలోని కరిలి గ్రామానికి చెందిన రమ అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది.

Advertisement

పెళ్లి చేసుకున్న తరువాత అత్తగారి ఇంటికి హెలికాప్టర్‌లో వెళ్లాలని ఉందని రమ సియారామ్‌కు చెప్పింది.ఆమె కోరికను నెరవేర్చేందుకు సియారామ్ హెలికాప్టర్ ఏర్పాట్లు చేశాడు.

హెలికాప్టర్‌ అద్దెకు తీసుకున్నాడు.మొత్తంగా హెలికాప్టర్ కు వరుడు రూ.7లక్షలు ఖర్చు చేయడం విశేషం.సియారామ్ ప్రయత్నాన్ని కొంతమంది అభినందిస్తుండగా, మరికొంతమంది మాత్రం చాపర్ కోసం అంత డబ్బు ఖర్చు చేయడం ఎందుకని విమర్శిస్తున్నారు.

తాజా వార్తలు