తెలుగులో ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ మరియు నేచురల్ స్టార్ నాని తదితరుల కాంబినేషన్ లో తెరకెక్కిన “కృష్ణార్జున యుద్ధం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ముంబై బ్యూటీ గురించి “రుక్సార్ థిల్లాన్” సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వచ్చి రావడంతోనే ఈ అమ్మడు తన అందం, అభినయం, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.
దీంతో వెంటనే ఈ అమ్మడికి అల్లు హీరో అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబిసిడి (అమెరికన్ బర్న్ కన్ఫ్యూజ్ దేశి) అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినిమా కెరియర్ పై పడినట్లు సమాచారం.
అయితే ఈ రెండు చిత్రాల్లో నటించిన తర్వాత హిందీలో “బాంగ్రా పా లే” అనే ఓ డాన్స్ తరహా చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ కరోనా కారణంగా పాపం ఈ అవకాశం కూడా పెద్దగా కలిసి రాలేదు.
దీంతో ప్రస్తుతం రుక్సార్ థిల్లాన్ సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.కాగా ఆ మధ్య ఈ అమ్మడికి తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పటికీ కరోనా వైరస్ కారణంగా చిత్ర షూటింగ్ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ఈ అమ్మడికి తీవ్ర నిరాశే మిగిలింది.
అయితే చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం, ఉన్నటువంటి ఒకసారి రుక్సార్ థిల్లాన్ కి తెలుగులో సరైన హిట్ పడితే మళ్లీ స్టార్ హీరోయిన్ అవడానికి పెద్దగా టైమ్ పట్టదని కొందరు సినిమా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీనికితోడు రుక్సార్ థిల్లాన్ కి బాలీవుడ్లో కంటే తెలుగులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయని కూడా సూచిస్తున్నారు.
రుక్సార్ థిల్లాన్ తెలుగులో హీరోయిన్ గా నటిస్తుందో లేక ఒకటి రెండు తెలుగు చిత్రాలలో నటించి బాలీవుడ్ కి వెళ్లి చేతులు కాల్చుకుంటుందో చూడాలి.