తెలుగులో ప్రముఖ దర్శకుడు “శేఖర్ కమ్ముల” దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అనే చిత్రంలో బస్తీ కుర్రాడు నాగరాజు పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ హీరో సుధాకర్ కొముకల గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సుధాకర్ కొముకల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించడానికంటే ముందుగా పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ అతడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.
కానీ నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి సుధాకర్ కొముకలకి ఇప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాలేదని చెప్పవచ్చు.ఈ క్రమంలో ఎక్కువగా సుధాకర్ కొముకల రెండో హీరో మరియు గెస్ట్ అప్పియరెన్స్ ఇతర పాత్రల్లో నటించడంతో సుధాకర్ కి తగిన గుర్తింపు దక్కలేదు.
కాగా సుధాకర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన తర్వాత హ్యాంగ్ అప్, ఉందిలే మంచి కాలం ముందు ముందునా, కుందనపు బొమ్మ తదితర చిత్రాలలో హీరోగా నటించాడు.కానీ ఈ చిత్రాలు కనీసం విడుదలైనట్లు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.
దీంతో నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ సుధాకర్ అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.ఆ మధ్య “నువ్వు తోపురా” అనే చిత్రంలో హీరోగా నటించగా ఈ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ పెద్దగా సినిమా అవకాశాలను మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది.

కానీ హీరో గా మాత్రం మంచి కమ్ బ్యాక్ లభించింది.కాగా ఇటీవలే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రలో నటించి బాగానే ఆకట్టుకున్నాడు.అయితే ఇప్పటివరకు సుధాకర్ కటౌట్ కి సరిపోయే కథ పడకపోవడం మరియు పాత్రలు ఎంపికలో కూడా సుధాకర్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల సుధాకర్ కొముకల స్టార్ హీరో కాలేకపోయాడని చెప్పవచ్చు.
కాగా ప్రస్తుతం సుధాకర్ కొముకల చేతిలో కొత్త సినిమా ఆఫర్లు లేకపోవడంతో వెబ్ సీరిస్ లో నటించడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
అయితే ఈ మధ్యకాలంలో సుధాకర్ కముకుల మరియు అతడి భార్య అప్పుడప్పుడు పలు టాలీవుడ్ హిట్ చిత్రాలలోని పాటల కవర్ సాంగ్స్ లో నటిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నారు.