ఆ సీనియర్ కెమెరా మెన్ చాలా వేధించాడు.. దాంతో...

తెలుగులో పలు షోలు ఈవెంట్లలో తన గల గల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ బ్యూటిఫుల్ "యాంకర్ శ్యామల" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే యాంకర్ శ్యామల కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో పలు ధారావాహికలలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది.

అంతే కాకుండా ఈ మధ్య కాలంలో పలు చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ ఇటు వెండితెర ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది.కాగా ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో యాంకర్ శ్యామల పాల్గొని తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకి ఇక్కడ ఎవరూ పెద్దగా తెలియదని దాంతో అవకాశాల కోసం బాగానే శ్రమించానని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా తన స్వగ్రామం వేరే అయినప్పటికీ నటి అవ్వాలనే ఆశయంతో తన తల్లిని తీసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చానని తెలిపింది.

ఈ క్రమంలో మొదట్లో అడపాదడపా సీరియళ్లలో నటించే అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చింది.కానీ తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న సీరియల్ కి సినిమా పరిశ్రమలో పేరున్న సీనియర్ కెమెరామెన్ కూడా పనిచేస్తున్నాడని ఆ సమయంలో సీనియర్ కెమెరామెన్ తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.

Advertisement

అంతేకాకుండా తాను చెప్పినట్లు వినకపోతే సినిమా పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేస్తానని కొంతమేర లొంగదీసుకోవడానికి బెదిరింపులు కూడా చేశాడట.దీంతో ఒకానొక సమయంలో ఆ సీనియర్ కెమెరామెన్ బెదిరింపులు తాళలేక సినిమా పరిశ్రమని వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నానని కానీ తన తల్లి ప్రోత్సాహంతో మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపింది.అంతేకాక ఆ సీనియర్ కెమెరామెన్ గురించి సీరియల్ దర్శక నిర్మాతలకు కూడా ఫిర్యాదు చేశానని దాంతో కొంతమేర కెమెరామెన్ బెడద తప్పిందని చెప్పుకొచ్చింది.

కానీ తనని ఇంతటి క్షోభకు గురిచేసినటువంటి ఆ కెమెరామెన్ పేరుని బయటకు పెట్టడానికి మాత్రం యాంకర్ శ్యామల ఇష్ట పడలేదు.

ఇక తన వైవాహిక జీవితం గురించి స్పందిస్తూ తన భర్త నరసింహ కూడా నటుడు కావడంతో ఇద్దరూ ఓ సీరియల్ లో నటిస్తున్న సమయంలో ప్రేమించుకున్నామని, ఆ తరువాత ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.అయితే తన భర్త నరసింహ తనని చాలా బాగా అర్థం చేసుకున్నాడని అందువల్లనే ఇద్దరు నటీనటులు అయినప్పటికీ తమ లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చింది.కాగా ప్రస్తుతం యాంకర్ శ్యామల యూట్యూబ్ లో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు ఈవెంట్లు, షోలలో కూడా యాంకరింగ్ నిర్వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు