నేటి కాలంలో ఏటియం ఉపయోగించని వారంటూ కనిపించరు.చదువుకున్న చదువుతో, చేస్తున్న పనితో సంబంధం లేకుండా ప్రతి వారి జీవితంలో ఏటీయం ఒక భాగం అయ్యింది.
ఇక మనలో చాలా మందికి ఏటీయం సరిగ్గా ఊపయోగించడం రాదు.ఇందుకు గానూ అపరిచితుల సహాయం తీసుకుని మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
దీనికి తోడు సైబర్ నేరగాళ్ల బాధలు కూడా ఏటీఎం ఉపయోగిస్తున్న వారికి తప్పడం లేదు.
ఈ క్రమంలో మరో తలనొప్పి వచ్చిపడింది.
ఏటీఎం ఉపయోగిస్తున్న వారంతా అలెర్ట్ గా ఉండమంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంది.ఇక ఈ మధ్య కాలంలో ఏటీఎంలో చోరీలకు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రభుత్వం బ్యాంకులను అప్రమత్తం చేసింది.
ఏటీఎం స్విచ్ నుంచి ఏటీఎం హోస్ట్ కు వెళ్లే సందేశాలను నేరాగాళ్లు మరో పరికరం ద్వారా మార్చివేస్తున్నారని, తద్వారా అక్రమంగా నగదును విత్‌డ్రా చేస్తున్నారని వెల్లడిస్తుంది.ఇక ఇలాంటి చోరీలను అరికట్టేందుకు ఏటీఎం టెర్మినల్‌కు ఏటీఎం స్విచ్‌కు మధ్య కమ్యూనికేషన్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండాలని, అలాగే ఏటీఎం సెంటర్లలో నెట్ వర్క్ కేబుల్స్, ఇన్ పుట్, ఔట్ పుట్ పోర్టులు బయటకు కనబడకుండా చూడాలని ఆదేశాలు ఇస్తుంది.