కీలక దశకు చేరిన "సాగర సంగమం"... గెలుపెవరిది?

తెలంగాణలో గత ఆరు నెలల నుండి వరుస ఎన్నికలు జరుగుతున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నిక మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా వరుస పెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.

అయితే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.ఇక త్వరలో ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఇక ప్రతిపక్షాలు, పాలక పక్షంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ప్రజలలోకి వెళ్తున్నాయి.

మేమే గెలుస్తామని ఎవరికి వారే ప్రకటించుకున్న పరిస్థితి.ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందనే విషయం తేటతెల్లమైన నేపథ్యంలో ఇరు పార్టీలలో గెలుపెవరిదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది.

Advertisement

ఎవరి ఊహగానాలు ఎలా ఉన్నా విజేత ఎవరో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.ఈ ఎన్నికలను ఎందుకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక సార్వత్రిక ఎన్నికలకు వచ్చే ఏడాది తరువాత ఇంకొక ఏడాది ఉంటుంది.

అది ఎన్నికల సంవత్సరం అని చెప్పవచ్చు.అయితే ఈ ఎన్నికలో గెలిస్తే ఇక కార్యకర్తలలో ఉత్తేజం వచ్చి, ఇక ఈ కీలకమైన రెండు సంవత్సరాలు చాలా యాక్టివ్ గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ ఎన్నికపై పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టాయనే చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు