కరోనా హాట్ స్పాట్ గా మారిన ఆ రాష్ట్ర ఎయిమ్స్.. భారీ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు.. !

ప్రస్తుతం కరోనాకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటే.దేశంలో గానీ, రాష్ట్రాల్లో గానీ కోవిడ్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతుందని అధికారులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలు స్కూళ్లల్లో, కాలేజీల్లో, చివరికి క్యాంపస్‌ల్లో కూడా భారీగానే కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి, అవుతున్నాయి.పలువురు వైద్య సిబ్బంది కూడా ఈ కరోనా కొరలకు చిక్కుతున్నారు.

అయితే తాజాగా మధ్యప్రదేశ్ లోని ప్రతిష్ఠాత్మక వైద్యశాలగా పేరున్న ఎయిమ్స్ కూడా ఇప్పుడు కరోనా మహమ్మారికి నిలయంగా మారింది.ఎయిమ్స్ లోని 53 మంది డాక్టర్లు, విద్యార్థులు మహమ్మారి బారిన పడటం తీవ్ర కలకలం రేపుతుంది.

కాగా ఈ వైరస్ బారిన పడిన వారి జాబితాలో వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కూడా ఉండటం కొంత ఆందోళన కలిగిస్తున్న విషయం.

Advertisement

ఇకపోతే భోపాల్ ఎయిమ్స్ కు నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు.ఇందులో కోవిడ్ సోకిన వారు, వైరస్ బారినపడని వారు ఉంటారు.కానీ ఇలా హస్పటల్ కు వచ్చేటప్పుడు కరోనా నియమాలు పాటించడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

అందుకే గత కొంతకాలంగా కరోనా సోకిన వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్లు ఎవరిని కాంటాక్ట్ చేశారన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారట.ఇదిలా ఉండగా ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు