పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి వెండితెరపై “వకీల్ సాబ్” సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నారు.ఈ క్రమంలో ఏపీలో బెనిఫిట్ షోల కి పర్మిషన్ లేదని నిన్న నిలిపివేయటం మాత్రమే కాక.
బెనిఫిట్ షోలు వేస్తే కఠిన చర్యలు తప్పవని అన్ని థియేటర్లని ప్రభుత్వం హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.ఇలాంటి తరుణంలో తాజాగా ఈ సినిమా గురించి నెల్లూరులో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” రిలీజ్ అయింది.ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నికలలో ఆయన తనకు సపోర్ట్ చేయటం లేదు.బిజెపికి సపోర్ట్ చేస్తున్నారు… అది వేరే విషయం.ముఖ్యమంత్రిని విమర్శించాడు కాబట్టి ఆయన సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అవ్వకుండా ప్రభుత్వం కుట్ర పన్నినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు.
మామూలుగా ఏ పెద్ద హీరో సినిమా అయినా రిలీజ్ అయితే స్పెషల్ షో లు వేసుకుంటారు.రేట్లు కూడా పెంచుకుంటారు.
అయితే పవన్ కళ్యాణ్ ని దెబ్బ వేయటానికి ఆయన నటించిన “వకీల్ సాబ్” సినిమా విషయంలో ప్రభుత్వం టికెట్లు రేట్లు పెంచనివ్వకుండా అడ్డుపడింది.బెనిఫిట్ షో లు వేసుకొ నివ్వలేదు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.