IPL ప్లేయర్స్ కు కరోనా వ్యాక్సిన్..!

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ బాగానే చూపిస్తుంది.ఇప్పటికే రోజు రోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.

అయితే ఇలాంటి టైం లో ఐపిఎల్ సీజన్ మొదలుపెడుతున్నారు.ఈ నెల 9 నుండి ఐపిఎల్ 14వ సీజన్ మొదలవుతుంది.

అయితే కరోనా కోరలు చాస్తున్న వేళలో ఐపీఎల్ లో పాల్గొనే క్రీడాకారులకు వ్యాకినేషన్ చేయించాలని అంటున్నారు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.ప్లేయర్స్ కు వ్యాక్సినేషన్ అంశంపై ఆలోచనలో ఉన్న బీసీసీఐ దీనికి సంబందించి కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపనున్నట్టు తెలిపారు.

క్రీడాకారుల ఆరోగ్య పరిరక్షణ దృష్యా వ్యాక్సినేషన్ ఉత్తమని అభిప్రాయపడుతున్నారు.ఐపీఎల్ కోసం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోనున్నట్టు చెప్పారు.

Advertisement

ముందు ప్రకటించిన ఆరు వేదికల్లోనే మ్యాచ్ లను నిర్వహిస్తామని అన్నారు.ఖాళీ స్టేడియాల్లోనే టోర్నీ మొత్తం కొనసాగుతుందని చెప్పారు.

అయితే ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందుతుంది.నితీష్ రాణాకు కరోనా నిర్ధారణ కాగా.

అక్షర్ పటేల్ కు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.దేవ్ దత్ పడిక్కల్ కు కరోనా వచ్చినట్టు తెలుస్తుంది.

ఆటగాళ్ల వ్యాక్సినేషన్ వల్లనే కరోనా కట్టడి చేయొచ్చని బీసీసీఐ అందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు