మరోసారి అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్..!

ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఫ్యూచర్ ను అందుబాటులోకి తీసుకొని రాబోతుంది.

తన వినియోగదారుల కోసం వాట్సప్ లోని చాట్ బాక్సుల కలర్స్ ను మార్చుకునే విధంగా సరికొత్త ఫీచర్ ను  అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

ఇక నుంచి కస్టమర్లు కేవలం బ్లాక్ కలర్ లోనే కాకుండా బ్లూ, గ్రీన్‌ కలర్‌ లోనూ టైప్ చేసుకునే సదుపాయం అందజేస్తుంది.వాట్సాప్ కస్టమర్లు తమ వాట్సాప్ లో రంగురంగులుగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫ్యూచర్ కేవలం ఐఓఎస్‌ బీటా వెర్షన్ లో మాత్రమే కొనసాగుతుంది.ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అన్న విషయంపై ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు వాట్సాప్ సంస్థ.

వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ చాలా అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేయడానికి అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లును ఎప్పటికి అప్పడూ  చేస్తోంది.

Advertisement

ఇటీవల ప్రవేశ పెట్టిన సరికొత్త ఫీచర్ బీటా వెర్షన్ వినియోగదారులను  ఎంతగానో ఆకట్టుకుంది.ఈ ఫీచర్ ద్వారా వాయిస్ నోట్లను స్పీడ్ గా ప్లే సెట్ చేసుకొనే సదుపాయం అందజేసింది.అలాగే ఇటీవల కాలంలోనే చాట్‌ థ్రెడ్‌ ఫీచర్‌ను కూడా పరిచయం చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ ఫీచర్ ను  వినియోగించే వినియోగదారులు వారి సమస్యలను వాట్సప్ సులభంగా రిపోర్ట్ చేయవచ్చు.అంతేకాకుండా కేవలం రెండు రోజులలోనే ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా సులువుగా పొందవచ్చు.

ముందుగా ఈ ఫీచర్ ను బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులోకి తీసుకొని వచ్చిన, అతి త్వరలోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా  పరిచయం చేయబోతున్నట్లు వాట్సప్ తెలిపింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు