మరో సారి మానవత్వం చాటుకున్న సోనూసూద్ ఏం చేసాడంటే?

కరోనా ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో మనకు తెలిసిందే.

ఒక కోటీశ్వరులు తప్ప అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డ విషయం మనకు తెలిసిందే.

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పుడు వలస కార్మికులు పడ్డ బాధలు వర్ణనాతీతం అని చెప్పాలి.ఒక్కసారిగా లాక్ డౌన్ విధించడంతో ఇక ఉపాధి లేకపోవడంతో ఇక గత్యంతరం లేక కాలి నడకన పిల్లా పాపలతో తమ గమ్య స్థానాలకు బయలు దేరి వెళ్లారు.

ఇక కొన్ని వందల కిలోమీటర్లు తమ సామాన్లతో నడిచి వెళ్లిన ఘటనలు చాలా చూసాం.ఇక అటువంటి సమయంలో వారిని దేవునిలా ఆదుకున్న వ్యక్తి సోనూ సూద్.

వారందరికీ తన సొంత డబ్బుతో వారి వారి గమ్య స్థానాలకు చేరేలా సాయమందించాడు.అలా కొన్ని వేల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చి ఒకసారిగా వారి పాలిట దేవుడయ్యాడు.

Advertisement

ఇక అంత వరకే చేసి ఊరుకోకుండా అత్యవసర వైద్యం కావలసిన వారికి, ప్రమాదకరమైన జబ్బులతో బాధపడుతూ వైద్యానికి డబ్బులు లేని వారికి తన సొంత డబ్బుతో వైద్యం చేయించి కలియుగ కర్ణుడిగా మారిపోయాడు.ఇక మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు సోనూ సూద్.

లక్నో లోని పలు గ్రామాల్లో 40 గ్రామాలకు చెందిన 300 మంది విద్యార్థినులకు మొబైల్ ఫోన్ లు పంపిణీ చేసారు.కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్న తరుణంలో మొబైల్ ఫోన్ లు కొనుక్కునే స్థోమత లేక ఆన్ లైన్ క్లాసులకు దూరమవుతున్న దృష్ట్యా సోనూ సూద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు