వక్కంతం వంశీకి ఓకే చెప్పిన నితిన్

యూత్ స్టార్ నితిన్ కెరియర్ ఎప్పుడూ మూడు ఫ్లాప్ లు ఒక హిట్ అన్నట్లు నడుస్తూ ఉంటుంది.

కెరియర్ ఆరంభంలో హ్యాట్రిక్ కొట్టి తరువాత ఏకంగా 12 ఏళ్ల పాటు హిట్ సినిమా మొహం చూడలేదు.

అయితే అతని స్టొరీ సెలక్షన్ కారణంగానే అన్ని సంవత్సరాల పాటు చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది.కమర్షియల్, హీరోయిజం అంటూ వెళ్లి తనకు సెట్ కాని కథలు ఎంపిక చేసుకొని భారీగా దెబ్బతిన్నాడు.

ఇష్క్ సినిమాతో మళ్ళీ నితిన్ గాడిలో పడ్డాడు.ఆ సినిమా హిట్ తర్వాత తనకు లవ్ స్టొరీ, ఎంటర్టైన్మెంట్ సెట్ అవుతుందని అలాంటి కథలని నమ్ముకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

ఈ ప్రయాణంలో మంచి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు.అఆ, భీష్మ సినిమాలతో ఏకంగా 50 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయాడు.

Advertisement

సరైన కంటెంట్ పడితే అతని మార్కెట్ స్టామినాకి 50 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదని ఆ సినిమాలు నిరూపించాయి.భీష్మ తర్వాత మళ్ళీ నితిన్ ఈ ఏడాది చెక్ సినిమాతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అలాగే రంగ్ దే సినిమా కూడా డివైడ్ టాక్ తోనే నడుస్తుంది.లాంగ్ రన్ లో సినిమాకి వచ్చే కలెక్షన్ బట్టి రంగ్ దే ఎవరేజ్ అయ్యిందా, ఫ్లాప్ అయ్యిందా అనే విషయం క్లారిటీ వస్తుంది.

ఇక ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అందాదున్ సినిమాని మ్యాస్ట్రో టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నడుస్తుంది.

ఇదిలా ఉంటే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమా చేయడానికి గతంలోనే ఒకే చెప్పాడు.అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇప్పుడు రచయిత నుంచి నా పేరు సూర్య సినిమాతో దర్శకుడుగా మారిన వక్కంతం వంశీ చెప్పిన కథకి రీసెంట్ గా నితిన్ గ్రీన్ సైగల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే రవితేజ గతంలో వక్కంతం వంశీ కథకి ఒకే చెప్పాడని టాక్ నడిచింది.

Advertisement

అయితే ఇప్పుడు అదే కథని నితిన్ కి చెప్పి ఒప్పించాడా లేక కొత్త కథానా అనేది చూడాలి.

తాజా వార్తలు