ఇటీవల కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య జాయింట్ పెయిన్స్.వయసు పైబడే కొద్ది జాయింట్ పెయిన్స్ రావడం సర్వ సాధారణం.
కానీ, ప్రస్తుతం యుక్త వయసులో ఉన్న వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది.ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, పోషకాల లోపం, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల జాయింట్ పెయిన్స్ ఏర్పడతాయి.
ఇక వీటిని తగ్గించుకుందుకు చాలా మంది మందులు వాడుతుంటారు.కానీ, కొన్ని కొన్ని ఆహారాలు డైట్‌లో చేర్చుకుంటే.
న్యాచురల్‌గానే జాయింట్ పెయిన్స్‌కు చెక్ పెట్టవచ్చు.
వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలుసు.
అయితే జాయింట్ పెయిన్స్ తగ్గించడంలోనూ వాల్ నట్స్ ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.వాల్ నట్స్‌ను రోజుకు ఐదు నుంచి పది వరకు తీసుకుంటే.
అందులో ఉండే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ క్రమంగా జాయింట్ పెయిన్స్‌ను తగ్గిస్తాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్.ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలా మందిని దీనిని ఉపయోగిస్తున్నారు.ఆపిల్ జ్యూస్ లో ఈస్ట్ కలపడం వల్ల ఆపిల్ సైడర్ వెనిగర్ అవుతుంది.
జాయిల్ పెయిన్స్ తగ్గించడంతో ఇది కూడా అద్భుతంగా సహాయపడుతుంది.భోజనం చేయడానికి అర గంట ముందు గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు తేనె కలిపి తీసుకుంటే.
మంచి ఫలితం ఉంటుంది.
మెంతులు కూడా జాయింట్ పెయిన్స్‌ను తగ్గించడంలో గ్రేట్‌గా ఉపయోగపడతాయి.
ప్రతి రోజు ఉదయం గోరు వెచ్చని నీటిలో మెంతుల పొడి కలిపి తీసుకుంటే.మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఆలివ్ ఆయిల్ కూడా జాయింట్ పెయిన్స్‌ను తగ్గిస్తుంది.ఆలివ్ ఆయిల్ ఖరీదు ఎక్కువే అయినప్పటికీ.
అందులో ఉండే మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వును కరిగించడంతో పాటు జాయింట్ పెయిన్స్‌ను కూడా నివారిస్తాయి.కాబట్టి, సలాడ్స్‌లో మరియు ఇతర విధాలుగా ఆయివ్ ఆయిల్ తీసుకుంటే మంచిది.