ట్రంప్ కు భారీ ఆస్తి నష్టం...కరోనా దెబ్బేసిందిగా...!!

అమెరికా అధ్యక్షుడు గా రెండో సారి పోటీ చేసిన డోనాల్డ్ ట్రంప్ ఘోరమైన పరాజయాన్ని చవి చూశారు.

అందుకు ప్రధాన కారణం కరోనా మహమ్మారి అని అందరికి తెలిసిందే.

మహమ్మారిని అదుపు చేయలేక, ప్రజలను వైరస్ నుంచీ రక్షించే చర్యలు చేపట్టలేని ట్రంప్ కు అధ్యక్ష పీటం దూరమయ్యింది.అయితే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన లక్షల కోట్ల ఆస్తులు, బిజినెస్ వ్యవహారాలపై దృష్టిపెట్టని ట్రంప్ కు ఇప్పుడు గట్టి షాకే తగిలింది.

ఊహించని విధంగా ట్రంప్ కు వేల కోట్ల నష్టం వాటిల్లింది.బిజినెస్ వ్యవహారాలు అల్లుడికి, కొడుకుకు ఇచ్చి తడి గుడ్డ వేసుకున్న ట్రంప్ కు కరోనా పెద్ద దెబ్బే వేసింది.

కరోనా ప్రభావంతో అమెరికాలో వేల సంఖ్యలో చిన్న, పెద్ద బిజినెస్ లు అన్నీ మూత పడ్డాయి దాంతో తీవ్ర నష్టం వాటిల్లింది.ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి ట్రంప్ బిజినెస్ లపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది.

Advertisement

ట్రంప్ కు లెక్కకు మించి బిజినెస్ లు ఉన్నాయి.గోల్ఫ్ కోర్ట్ లు రిసార్ట్ లు, రెస్టారెంట్ లు షాపింగ్ మాల్స్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బిజినెస్ లు ఉన్న ట్రంప్ కు కరోనా దెబ్బేసింది.

ట్రంప్ కు ఉన్న బిజినెస్ లు కరోనా కాలంలో మూత పడటంతో దాదాపు 700 మిలియన్ డాలర్లు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.భారత కరెన్సీలో ఈ మొత్తం లెక్కేస్తే రూ.5 వేల కోట్ల పై మాటేనట ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ అనే సంస్థ వెల్లడించింది.ఈ నష్టం కారణంగా ట్రంప్ ఆస్తుల విలువ 2.౩ బిలియన్ డాలర్ల కు చేరుకుందని ప్రకటించింది.ఇదిలాఉంటే కరోనా ట్రంప్ కు ఓటమి భారమే కాదు, భారీ ఆర్ధిక భారాన్ని కూడా ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Advertisement

తాజా వార్తలు