ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. ఈరోజు ఎన్నంటే.. ?

గత కొద్దిరోజులుగా సైలంట్‌గా ఉన్న కరోనా మనుషుల్లో భయం తగ్గిపోయేసరికి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది.

అందులో ప్రజలు గుంపులు గుంపులుగా కలవడం, స్కూళ్లూకూడా ప్రారంభించడం, ఇలా అన్ని సంస్దలు, హోటళ్లూ ప్రారంభం అవడంతో ఎవరి నుండి, ఎటు వైపు నుండి ఈ వైరస్ దాడి చేస్తుందో తెలియదు గానీ మొత్తానికి తన బలాన్ని పుంజుకుంటుంది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.ఇకపోతే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,970 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా, 135 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.

కాగా కరోనా కారణంగా ఒక్కరు మరణించగా, 82 మంది ఈ వైరస్ నుండి కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 8,90,215కు చేరగా, ఇప్పటి వరకు 8,82,219 మంది కరోనా నుంచి కోలుకున్నారట.

ప్రస్తుతం రాష్ట్రంలో 826 యాక్టివ్ కేసులు ఉండగా, 7,170 మంది కరోనాతో మృతిచెందారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు