2014 సంవత్సరంలో విడుదలైన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే.ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న పూజా హెగ్డే గత కొన్నేళ్ల నుంచి తెలుగులో నటిస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లవుతున్నాయి.
ఈ ఏడాది పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదల కానుండగా కొత్త సినిమాలకు సంబంధించి త్వరలో ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న శాకుంతలం సినిమాలో కూడా హీరోయిన్ గా మొదట పూజాహెగ్డే పేరు వినిపించింది.
స్టార్ హీరోల సినిమాలో ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తున్న పూజాహెగ్డే తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు.అయితే ముంబైలో పూజా హెగ్డే తల్లిదండ్రులు స్థిరపడగా పూజా హెగ్డే ముంబైలోనే చదువుకున్నారు.
పూజా తల్లి పేరు లతా హెగ్డే కాగా తండ్రి పేరు మంజునాథ్ హెగ్డే.

పూజా హెగ్డే తండ్రి లాయర్ కాగా ఆమె తల్లి ఇమ్యూనాలజిస్ట్ అని తెలుస్తోంది.పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే డాక్టర్.పూజా హెగ్డే తల్లిదండ్రులు, సోదరునితో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఆచార్య సినిమాలో కూడా చిన్న పాత్రలో పూజా హెగ్డే నటిస్తుండగా ఆ పాత్ర కోసం పూజా హెగ్డేకు భారీ మొత్తం రెమ్యునరేషన్ అందినట్టు తెలుస్తోంది.మే 13వ తేదీన ఆచార్య మూవీ విడుదల కానుంది.
రంగస్థలం సినిమాలో జిగేలు రాణి పాటకు చరణ్ తో కలిసి స్టెప్పులేసిన పూజా హెగ్డే ఈ సినిమాలో చరణ్ కు జోడీగా నటించనున్నారు.ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో పూజా హెగ్డే కనిపించనుందని.
సినిమాల్లో 20 నిమిషాల పాటు పూజా హెగ్డే పాత్ర ఉంటుందని చరణ్, పూజా హెగ్డేల మధ్య ఒక పాట కూడా ఉంటుందని సమాచారం.