అందుకే నానితో నేను తీసిన సినిమా ఫ్లాప్ అయ్యింది... కానీ...

తెలుగులో పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ దర్శకుడు "కృష్ణ వంశీ" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

కాగా దర్శకుడు కృష్ణ వంశీ తెలుగులో సీనియర్ హీరో జేడీ చక్రవర్తి హీరోగా నటించిన "గులాబీ" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

అంతకు ముందు పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు.కాగా తాజాగా డైరెక్టర్ కృష్ణ వంశీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కున్న ఒడిదుడుకుల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా ముఖ్యంగా తాను సినిమా పరిశ్రమలో దర్శకుడిగా పని చేస్తున్న సమయంలో ఆర్థిక మోసాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు.ఇందులో ముఖ్యంగా కొందరు ఫైనాన్షియర్లు సినిమా బడ్జెట్ విషయంలో అలాగే విడుదలైన తర్వాత వచ్చేటువంటి లాభంలో కూడా పలు మోసాలకు పాల్పడ్డారని కానీ తాను మాత్రం ఎప్పుడూ కూడా మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాననే తృప్తితో ఆర్థిక మోసాలను పెద్దగా పట్టించుకోలేదని తెలిపాడు.

అంతేగాక ఆ మధ్య తాను నాని హీరోగా నటించిన పైసా చిత్రానికి దర్శకత్వం వహించానని కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని తెలిపాడు. కాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో కూడా పలు అనివార్య కారణాల వల్ల కొంతమేర ఆలస్యమైందని అందువల్లనే అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేయలేక పోయామని, అందువల్లే ఈ చిత్ర అంచనాలు తారుమారయ్యని తెలిపాడు.

Advertisement

ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ఆ మధ్య కృష్ణ వంశీ తెరకెక్కించిన పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం, తదితర చిత్రాలు యావరేజ్ గా నిలిచినప్పటికీ దర్శకుడు కృష్ణ వంశీ మార్కు ని ఏమాత్రం అందుకో లేకపోయాయి.దీంతో ప్రస్తుతం కృష్ణ వంశీ తెలుగులో "రంగ మార్తాండ" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కృష్ణ వంశీ ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని బాగానే శ్రమిస్తున్నాడు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు