తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ హీరోయిన్స్ అంతా తెలంగాణ వారే అని మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆంధ్ర కి సంబంధించిన హీరోలు ఎక్కువగా ఉండేవారు కానీ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన హీరోలు కూడా ఎక్కువ అయిపోయారు ఒకప్పుడు కాంతారావు మాత్రమే తెలంగాణా కి సంబంధించిన హీరో గా ఉండేవాడు జానపద చిత్రాలకు కాంతారావు ఫేమస్ హీరో గా ఉండేవాడు కాంతారావు గారికి కత్తి కాంతారావు అనే బిరుదు కూడా ఉంది.

అలాంటి కాంతారావు తర్వాత ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఆర్టిస్ట్ లు గాని దర్శకులు గాని ఎక్కువగా వస్తున్నారు.

తెలంగాణ నుంచి కాంతారావు తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది హీరో నితిన్ అనే చెప్పాలి.నితిన్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు పూర్తయింది.

నితిన్ తర్వాత ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోల్లో అగ్ర హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ కూడా తెలంగాణకు సంబంధించిన హీరోనే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇండస్ట్రీలో హీరోగా స్థిరపడిపోయాడు.ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తున్నాడు.

తెలంగాణ నుంచి వచ్చిన హీరోలు ఇలా ఉంటే హీరోయిన్ గా వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.ముత్యాలముగ్గు సినిమా తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.

Advertisement

సంగీత గారిది వరంగల్.సంగీత హీరోయిన్ గా వేషాలు తగ్గిపోవడంతో ఆ తర్వాత అమ్మగా అమ్మమ్మ గా చాలా సినిమాల్లో నటించింది.

ఇడియట్ సినిమాలో రవితేజ తల్లిగా కూడా నటించింది.ఆవిడ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్.

విజయశాంతి

విజయశాంతి వరంగల్ లో పుట్టి చెన్నైలో చదువుకుంది.ప్రతిధ్వని, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ నీ సంపాదించుకున్నారు.ఆవిడ హీరోల పక్కన హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేది.

తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు ఆ తర్వాత కెసిఆర్ గారి తో కలిసి టిఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేశారు ప్రస్తుతం ఆవిడ బిజెపి పార్టీలో కొనసాగుతున్నారు.

కీర్తి రెడ్డి

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డి గారిది కూడా తెలంగాణనే కీర్తి రెడ్డి నిజామాబాద్ లో పుట్టి పెరిగింది.తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ గా నటించి అప్పుడున్న యూత్ అందరికీ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది కానీ తొలిప్రేమ తో వచ్చిన క్రేజ్ నీ తర్వాత సినిమాలలో నిలుపుకోలేకపోయింది ఒకవైపు హీరోయిన్ గా చేస్తూనే గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన అర్జున్ సినిమాలో మహేష్ బాబు అక్క గా నటించింది.

Advertisement

ఆ తర్వాత సుమంత్ ని పెళ్లి చేసుకుంది.పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే ఇద్దరు విడిపోయారు ప్రస్తుతం ఆమె రెండో పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడ్డారు.

ప్రత్యూష

తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన ఇంకో హీరోయిన్ ప్రత్యూష మొదట్లో హీరోయిన్ ఫ్రెండ్ గా హీరో చెల్లెలు గా చేసిన ప్రత్యూష తర్వాత హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాల్లో చేశారు.ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన కలుసుకోవాలని సినిమాలో ప్రత్యూష ఒక హీరోయిన్ గా నటించింది.ప్రత్యూషది తెలంగాణలోని భువనగిరి.

మంచి భవిష్యత్తు ఉన్న ప్రత్యూష అనుకోని కారణాలవల్ల చనిపోయింది.తను కనుక బ్రతికి ఉంటే ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అయ్యుండేది.

రేష్మ రాథోడ్

రేష్మా రాథోడ్ మారుతి తీసిన ఈరోజుల్లో సినిమాతో ఫేమస్ అయ్యారు.రేష్మ భద్రాద్రి జిల్లా ఇల్లందు ఈరోజుల్లో సినిమా తర్వాత బాడీగార్డ్, లవ్ సైకిల్ లాంటి సినిమాల్లో నటించారు ప్రస్తుతం ఈవిడ రాజకీయాల్లోకి రావాలని కూడా చూస్తున్నారు.

అదితి మైకేల్

అదితి మైకేల్ గారిది కామారెడ్డి ఈవిడ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత అర్జున్ రెడ్డి ,అమీ తుమీ వంటి సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సాధించారు ముఖ్యంగా ఈవిడ తెలంగాణా స్లాంగ్ లో ఇంగ్లీష్ ,హిందీ మిక్స్ చేస్తూ సరదాగా మాట్లాడుతారు ప్రస్తుతం వచ్చే కొత్త సినిమాల్లో తనకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు.

తాజా వార్తలు