వీడియో వైరల్.. పాపం అంత బొచ్చు ను ఎలా మోసిందో కదా..!

సాధారణంగా గొర్రెలు చూడడానికి చాలా సన్నగా, క్యూటీగా కనపడుతాయి.

కానీ, తాజాగా ఆస్ట్రేలియా లోని విక్టోరియా లవ్ ఫీల్ ప్రాంతంలో ఒక వ్యక్తికి ఒంటినిండా ఎక్కువ బొచ్చుతో కప్పబడి ఉన్న ఒక జీవి కనిపించింది.

అది చూడడానికి ఏదో ఒక గ్రహాంతరవాసిల ఉందని, దాని దగ్గరికి వెళ్లడానికి ఆ వ్యక్తి భయం భయం గానే వెళ్ళాడు, కానీ చివరకు వెళ్లి చూస్తే అది ఒక అడవి గొర్రె అని తేలింది.దీంతో వెంటనే ఆ వ్యక్తి ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీ వారికి సమాచారం అందజేసి వారి దగ్గరికి ఆ గొర్రెను తరలించారు.

శరీరంపై భారీగా పేరుకొని పోయి ఉన్న ఆ గొర్రె మోయలేకపోయింది.ఆ గొర్రెకు ఉన్న ఉన్ని మొత్తం శాంక్చుయరీ సభ్యులు కత్తిరించి తూకం వెయ్యాగా ఏకంగా 35 కిలోల ఉన్ని తేలింది.

ఈ మొత్తం బరువు దాదాపు ఒక కంగారును ఉన్నంత బరువు తో సమానం.అధిక బరువు ఉన్న ఉన్నితో ఇన్ని సంవత్సరాలు అది ఎంత అల్లాడి పోయిందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

గొర్రె కు ఉన్న మొత్తం ఉన్నిని చాలా నీట్ గా కట్ చేసి శుభ్రంగా స్నానం చేయించారు మిషన్ ఫామ్ శాంక్చుయరీ వాళ్ళు.అంతవరకు చాలా విచిత్రంగా ఉన్న అడవి గొర్రె ప్రస్తుతం చాలా క్యూట్ గా మారిపోయి తెల్లగా అందరినీ ఆకట్టు కుంటుంది.ప్రస్తుతం ఆ అడవి గొర్రెకు ఉన్న ఉన్నిని కత్తరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

సాధారణంగా గొర్రెలకు సంవత్సరానికి ఒకసారైనా ఉన్నిని  కట్టరించల్సి ఉంటుంది.కానీ 5 సంవత్సరాలుగా ఆ గొర్రె కు ఉన్న ఉన్ని ని కత్తిరించకుండా అలానే ఉంచడంతో.అది అలాగే పేరుకొని పోయి చివరకు.35.4 కిలోలు పెరిగింది.ఈ సందర్బంగా ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీ సభ్యులు మాట్లాడుతూ.

" ఇంతకీ ఆ అడవి గొర్రె ఇన్నాళ్లు ఎలా బ్రతికిందో అర్థం కావట్లేదు" అని పేర్కొన్నారు.మీరు కూడా ఆ అడవి గొర్రెకు ఉన్న ఉన్నిని కత్తరిస్తున వీడియోను చూసేయండి.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు