అఖిల్ సురేందర్ రెడ్డి సినిమా మొదలయ్యేది అప్పుడేనట!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి అందరికీ తెలిసిందే.

అక్కినేని కుటుంబం నుండి వచ్చిన ఈ యంగ్ హీరో తక్కువ సమయంలోనే తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నాడు.

మొదటిసారి సిసింద్రీ సినిమాతో సినీ పరిశ్రమకు సంవత్సరం వయసులో అడుగుపెట్టిన అఖిల్ ఆ సినిమాలో ఎంతో ముద్దు గా నటించి బాగా ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత 2014 లో తెరకెక్కిన మనం సినిమాలో క్లైమాక్స్ సీన్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక 2017 లో హలో సినిమాలో హీరోగా తొలిసారిగా నటించాడు.ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో నటించగా తన నటనకు మంచి పేరు వచ్చింది.

ఇక గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించగా ఈ సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

Advertisement

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే మరో సినిమాకు ఓకే చెప్పాడు అఖిల్.

ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా గురించి ఎటువంటి క్లారిటీ లేకపోయేసరికి తాజాగా సినిమా షూటింగ్ గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.ఈ సినిమాను వచ్చే నెల ప్రారంభించనున్నారట.

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందని సినీ బృందం తెలిపారు.ఇన్ని రోజులు ఈ సినిమా బృందం ప్రీ ప్రొడక్షన్ పనులో బిజీగా ఉన్నారట.

ఇక ఈ సినిమాలో అఖిల్ కు గుర్రపు స్వారీ సీన్ ఉండటంతో గుర్రపుస్వారీ శిక్షణ కూడా తీసుకున్నారట.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలపనున్నారు.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు