మంచు పొరల కింద అరుదైన జీవిని కనిపెట్టిన బ్రిటిష్ శాస్త్రవేత్తలు..!

సముద్రం లోపల నివసించే జీవరాశుల ఎంత వింతగా, వికారంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మానవులు కేవలం రెండు శాతం మాత్రమే సముద్రంలో శోధించగలిగారు కానీ ఈ రెండు శాతం లోనే ఎర్రపెదాల గబ్బిలం చేప, సాలెపురుగు చేప, వాంపైర్ స్క్విడ్, డ్రాగన్ చేప, నెమలి రొయ్య వంటి ఎన్నో వింత జీవరాసులు మనకి కనిపించాయి.

సముద్రం లోతుల్లో అడవులు, అగ్నిపర్వతాలు, జలపాతాలు, టన్నుల కొద్దీ బంగారం, నిధులు వంటివి ఎన్నో దాగి ఉన్నాయి.కాంతిని ఉత్పత్తి చేసే అతి పెద్ద సముద్రజీవులను శాస్త్రవేత్తలు ప్రత్యేక పరికరాల ద్వారా కనిపెట్టారు.

అయితే ఇంకా కనిపెట్టని జీవులు ఎన్నో ఉన్నాయి.తాజాగా బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఒక అరుదైన జీవిని కనిపెట్టారు.

ఆగ్నేయ వెడెల్ సముద్రం వద్ద ఉన్న ఫ్లించర్ ఐస్ షెల్ఫ్ పై పరిశోధనలో భాగంగా బ్రిటిష్ అంటార్కిట్ సర్వే, పొలార్ శాస్త్రవేత్తలు మంచు పొరల కింద అత్యంత చీకటి ప్రదేశంలో గోప్రో కెమెరా సహాయంతో ఒక అరుదైన సముద్ర జీవిని కనిపెట్టారు.ఇది స్పాంజిలాగా ఉంది కానీ ఇవి ఏ జాతికి చెందిన జీవులో ఇంకా శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు.

Advertisement

వేరే అంశాలపై పరిశోధన చేస్తున్న సమయంలో అదృష్టవశాత్తు ఈ స్పాంజిలాంటి వింత జీవులు కెమెరాలకు చిక్కాయి.అయితే మంచు పొరల లోపల -2.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.ఇటువంటి శీతల ఉష్ణోగ్రతలలో జీవులు నివసించ లేవు కానీ కొత్తగా కనిపెట్టిన స్పాంజి లాంటి జీవులు మాత్రం చాలా నివసిస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

అయితే మంచు కరిగి పోయిన తర్వాత ఈ జీవులు ఎక్కడికి వెళ్తాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది.అంటార్కిటిక్ సముద్రం చాలా ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇలాంటి మరిన్ని జీవులను కనిపెట్టడానికి ముందు అడుగులు వేస్తామని బయోజియోగ్రాఫర్ డాక్టర్ గ్రిఫిత్స్ ప్రకటించారు.

అలాగే ట్విట్టర్ వేదికగా ఆయన తమ పరిశోధనలో కనిపెట్టిన కొత్త ఆవిష్కరణకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు