ఈ యంగ్ హీరోతో ఆ నిర్మాత చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడట... చివరికి...

సినిమా పరిశ్రమలో ఎలాగైనా సరే ఒక అవకాశం దక్కించుకుని తమ నటనా ప్రతిభను నిరూపించుకుని తమని తాము వెండి తెరపై చూసుకోవాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు.

ఈ క్రమంలో కొంతమంది కలలు కుటుంబ బ్యాక్గ్రౌండ్ మరియు డబ్బు, పరపతి తదితర వాటి వల్ల కొంత మేర సులభంగానే నెరవేరినప్పటికీ మరికొంతమంది మాత్రం చాలా కష్టాలు, అవమానాలు, ఎదుర్కొని అవకాశాలను దక్కించుకుంటుంటారు.

అయితే తెలుగులో 2017 సంవత్సరంలో "వెళ్ళిపోమాకే" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో విశ్వక్ సేన్ రెండో కోవకు చెందుతాడు.విశ్వక్ సేన్ కి చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించాలని చాలా ఆసక్తి ఉండేది.

అందువల్లనే తన ఏడవ తరగతి నుంచి సినిమా పరిశ్రమలో రాణించడానికి కావలసినటువంటి నైపుణ్యంపై దృష్టి సారించాడు.అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ పాల్గొని తన సినీ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తాను "వెళ్ళిపోమాకే"  చిత్రంలో నటించడానికంటే ముందుగా తెలుగు భాషలో తెరకెక్కిన ఓ చిత్రంలో నటించానని తెలిపాడు.అయితే ఈ చిత్రంలో నటించమని చిత్ర యూనిట్ సభ్యులు తనను సంప్రదించే సమయంలో తనతో పాటు ఈ చిత్రంలో తెలుగు ప్రముఖ నటుడు శ్రీకాంత్, మరియు మరో ప్రముఖ సంగీత దర్శకుడు, అలాగే ఇతర ఇతర ప్రముఖులు కూడా నటిస్తున్నట్లు తెలిపారని దాంతో తన కెరియర్ కి ఉపయోగపడుతుందని వెంటనే ఓకే చెప్పినట్లు చెప్పుకొచ్చాడు.

Advertisement

కానీ సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచే ఈ చిత్రంలో పని చేస్తున్నటువంటి ఒక్కొ టెక్నీషియన్ మరియు నటీనటులు వెళ్లిపోయారని దాంతో తాను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపాడు.ఇక తాను ఈ చిత్రం కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డానని కానీ ఆ చిత్ర నిర్మాత మాత్రం పోస్టర్లు విషయమై మాట్లాడేందుకు వెళ్లగా తనతో చాలా దురుసుగా ప్రవర్తించాడని తెలిపాడు.

ఆ సమయంలో తన సినీ కెరీర్ దృష్టిలో ఉంచుకొని ఆ సినిమా నిర్మాతను ఏమి అడగలేక అక్కడినుంచి వచ్చేసానని తెలిపారు. కానీ ఆ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదని అలాగే ఆ సినిమా పేరు చెప్పడానికి కూడా విశ్వక్ సేన్ ఇష్ట పడలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విశ్వక్ సేన్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.కాగా గత ఏడాది విశ్వక్ సేన్ హీరోగా నటించిన "హిట్" చిత్రం మంచి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

అయితే మొదటగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసినా కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడడంతో ఈ చిత్రాన్ని ఓటిటి అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.అయితే ప్రస్తుతం విశ్వక్ సేన్ తెలుగులో "పాగల్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

 ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జంటగా మలయాళ బ్యూటీ నివేదా పేతురాజ్ నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ పనులు మొదలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు