అనుష్క నిశ్శబ్దం సినిమాకి ఘోరమైన టీఆర్ఫీ రేటింగ్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న సౌత్ విమెన్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి అనుష్క శెట్టి.ఈ అమ్మడు బాహుబలి సినిమా తర్వాత రెగ్యులర్ కమర్షియల్ జోనర్ సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేసి ఫీమేల్ సెంట్రిక్ కథలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.

 Anushka Nishabdham Movie Trp Rating, Tollywood, Telugu Cinema, South Cinema, Hem-TeluguStop.com

ఈ నేపధ్యంలో బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం సినిమాలో అనుష్క నటించింది.అయితే ఈ సినిమా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని థియేటర్ లో రిలీజ్ అవ్వబోతుంది అనుకునే సమయానికి లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తప్పనిసరి పరిస్థితిలో ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది.

అయితే భారీ అంచనాలతో డిజిటల్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని చూసింది.డిజిటల్ లోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఏ మాత్రం కథాబలం లేని ఇలాంటి సినిమాకి అనుష్క ఎందుకు ఒకే చెప్పింది అనే చర్చ కూడా వచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమా జీతెలుగు ద్వారా శాటిలైట్ లో ప్రసారం అయ్యింది.

సంక్రాంతి ఫెస్టివల్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమాని టీవీలలో కూడా ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడలేదు.టీవీ ఛానల్ కెరియర్ లో అత్యంత ఘోరమైన రేటింగ్ ని నిశ్శబ్దం సినిమా సొంతం చేసుకుంది.ఈ సినిమాకి కేవలం 3.92 రేటింగ్ మాత్రమే వచ్చింది.ఈ స్థాయిలో రేటింగ్ వచ్చింది అంటే నిశ్శబ్దం సినిమా సినిమా చూడటానికి టీవీ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించలేదని అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube