దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు సినిమాలలో క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.రీ ఎంట్రీ గా వచ్చిన మొదటి సినిమా సంచలన విజయం సాధించడంతో శృతిహాసన్ కి తిరిగి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శృతిహాసన్ వకీల్ సాబ్, సలార్, పిట్టకథలు అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.తాజాగా ప్రభాస్ హీరోగా శ్రుతి హాసన్ చేస్తున్న సినిమా సలార్.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో శృతి హసన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె ఒక మీడియాతో మాట్లాడారు.
సినిమా ఇండస్ట్రీ లో పని చేసే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం ఉంటుంది.ప్రస్తుతం నా దృష్టి మొత్తం నా వృత్తి పరమైన జీవితం పై పెట్టాను.
అందరూ కూడా నా వృత్తి పరమైన జీవితం గురించి మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.అంతేకాకుండా మొదటిసారిగా ప్రభాస్ సరసన నటిస్తున్న అందుకు ఆమెకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను.ఇప్పటి వరకు తాను నటించిన పాత్రల్లో కన్నా ఈ సినిమాలో చేయబోయే పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుందని ఈ సందర్భంగా శ్రుతిహాసన్ తెలియజేశారు.

అంతేకాకుండా గత కొద్దిరోజుల నుంచి శృతి హాసన్ ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.తాజాగా శృతి హాసన్ బర్త్ డే రోజు ప్రత్యేకంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ విషయంపై శృతిహాసన్ స్పందిస్తూ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు.ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంచానని, ఎదుటివారి కూడా నా వర్క్ పై ఫోకస్ పెడితే బాగుంటుందని”ఆమె తెలిపారు







