మోనాల్ దశ తిరిగినట్టే.. సూపర్ స్టార్ మూవీలో ఛాన్స్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని ఆ స్పెషల్ సాంగ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ చిందులేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

 Bigg Boss Contestant Monal Got Chance In Sarkar Vaari Paata Movie, Sarkar Vaari-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 4 లో 14 వారాలు ఉన్న ఉన్న మోనాల్ గజ్జర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన మోనాల్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డ్యాన్సీ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.మహేష్ మూవీలో మోనాల్ కు నిజంగా ఛాన్స్ దక్కితే ఆమె దశ తిరిగినట్లేనని చెప్పవచ్చు.

Telugu Alludu Adhurs, Biggboss, Mahesh Babu, Maheshbabu, Monal, Monal Gajjar, Pa

మోనాల్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో బిగ్ బాస్ గుర్తింపు వల్ల వరుస అవకాశాలు వస్తున్నాయి.అయితే మోనాల్ సర్కార్ వారి పాటలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.మోనాల్ హిందీలో నటించిన కాగజ్ చిత్రం కూడా ఆమెకు మంచిపేరును తెచ్చిపెట్టింది.మోనాల్ తో సర్కార్ వారి పాట చిత్రయూనిట్ చర్చలు జరుపుతోందని మహేష్ మూవీలో ఛాన్స్ అంటే మోనాల్ నో చెప్పే అవకాశమే లేదని తెలుస్తోంది.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ఈ గుజరాతీ భామ వేగంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.మహేష్ ఈ సినిమాలో బ్యాంక్ లో పని చేసే అధికారిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

గీతా గోవిందం సినిమా తరువాత పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube