సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. న‌టి అనుమానాస్ప‌ద మృతి.. ?

రంగుల ప్రపంచం వెనక కంటికి కనిపించని విషాదాలు ఎన్నో.

తెరపై నవ్వుతూ, ప్రేమించిన వాడి కోసం ఎంతో కష్టపడే నటీమణులు నిజ జీవితంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు.

ఆ అందాల వెనక అంతులేని వేదన దాగుంటుందనే రహస్యాన్ని లోకానికి తెలియకుండా జాగ్రత్తపడి, చావును వెతుక్కుంటూ వెళ్లుతారు.ఎదురయ్యే సమస్యకు మరణం మాత్రమే సమాధానమని భావించి ఈ ప్రపంచం నుండి పారిపోతారు.

ఇలాగే ఓ నటి చేసింది.కన్న‌డ న‌టి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ జ‌య‌శ్రీ రామ‌య్య ఇవాళ మ‌ధ్యాహ్నం బెంగ‌ళూరులోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు సమాచారం.ఇక జ‌య‌శ్రీ బిగ్‌బాస్ సీజ‌న్ 3 లో 17 మంది కంటెస్టెంట్స్ తో క‌లిసి క‌నిపించింది.2017 లో శాండ‌ల్‌ వుడ్ సిల్వ‌ర్ స్క్రీన్ పై కూడా ఎంట్రీ ఇచ్చింది.ఇదిలా ఉండగా జయశ్రీ గత కొద్దికాలంగా డిప్రెష‌న్ తో బాధ‌ప‌డుతున్నట్లుగా తెలుస్తుంది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు