ప్రస్తుత రోజుల్లో ఏ మూలన ఏమి జరిగినా ఇట్టే సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసిపోతుంది.ఈ తరుణంలో ప్రస్తుత రోజుల్లో నేటి యువత వెరైటీ గా ఉన్న వాటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఇందులో భాగంగానే వ్యాపార రంగంలో వారు కూడా యువతను ఆకట్టుకునే విధంగా రెస్టారెంట్లకు వివిధ పేర్లను పెడుతూ ఆకర్షిస్తున్నారు.వీటితోపాటు యువతను బాగా ఆకట్టుకునేందుకు పలు ఆఫర్స్ ను ప్రకటిస్తూ వారి వ్యాపార సంస్థను మెరుగుపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా తెలుగు రాష్ట్రాలలో ఒక రెస్టారెంట్ పేరు చాలా బాగా వినిపిస్తోంది.ఇంతకీ ఆ రెస్టారెంట్ పేరు ఏంటో అని అనుకుంటున్నారా.?! అదేనండి ” పొట్ట పెంచుదాం”.వినడానికి వింతగా ఉన్నా ఓటర్ పేరు ఇదే.ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా.?! మన ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి లో కొత్తగా ఇటీవల కాలంలోనే ఏర్పాటు చేశారు.రెస్టారెంట్ పేరు వినడానికి కాస్త ఆకర్షించే విధంగా ఉన్నా కానీ.ఈ విషయం ఒకరి నుంచి మరొకరి కి చేరుకొని చివరకు సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారుతుంది.
ఇక గతంలో కూడా ఇలాంటి రెస్టారెంట్ పేర్లు చాలానే వైరల్ అయ్యాయి.అవి ఏమిటంటే తినేసి పో., ఉప్పు కారం, దిబ్బ రొట్టె, కోడి కూర చిట్టి గారే, దా తిను లాంటి వివిధ వెరైటీ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.సాధారణంగా ఇంట్లో వాళ్ళు బయట తిండి తినడం వల్ల పొట్ట పెరుగుతుందని, అంతేకాకుండా ఎక్కువగా బయట ఫుడ్డు తినవద్దని సలహాలు ఇస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.
ఇప్పుడు ఏకంగా ఒక రెస్టారెంట్ ఆ పేరును పెట్టి ప్రారంభం అవడం చాలా ఆశక్తికరమైన విషయంగా మారింది.యువతను ఆకట్టుకునేందుకు వివిధ రకాల పేర్లతో రెస్టారెంట్ వాళ్ళు వివిధ ఆఫర్లు, పేర్లతో ఏర్పాటు చేస్తున్నారు.