కరోనా సమయంలో దేశ ప్రజలకు ఆర్థికంగా అండగా నిలబడిన వ్యక్తి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ,ఇతర రాష్ట్రంలో చికుక్కున వలస కార్మికుల కోసం బస్సు లు ట్రైన్ లు వేసి వారి పాలిటదేవుడుగా మారాడు.ఇతర దేశంలో చికుక్కున ఇండియన్స్ కు స్పెషల్ ఫ్లైట్స్ వేసి ఇండియా కు రప్పించడంలో ఎంతో సాయం చేశాడు.
లాక్ డౌన్ హీరో, సినిమాలో విలన్ కావొచ్చు గాని నిజ జీవితంలో అసలైన హీరో సోనూ భాయ్ అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేశారు.
ప్రజలనుండి మంచి ఆదరణ లభించడం.
ఇప్పటికి ఎంతో మందికి తన వంతు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నాడని ప్రచారం కూడా సాగింది.
అందుకు సోనూ సూద్ నాకు రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేదని క్లారీటి ఇచ్చేశాడు.తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ ను ఆయన నివాసంలో సోనూ సూద్ కలవడం జరిగింది.
పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లుగా సమాచారం.ఈ విషయంపై సినీ, రాజకీయ వర్గాలో సర్వత్ర చర్చనీయాంశం అయ్యింది.
ఈ విషయంపై సోనూ సూద్ మాట్లాడుతూ నేను శరద్ పవార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా చెప్పాడు.మరే ఇతర కారణాలు లేవని స్పష్టం చేశాడు.సోనూ సూద్ కు జూహు ప్రాంతంలో ఆరు అంతస్తుల బిల్డింగ్ ఉంది.దానిని తన అనుమతి లేకుండా హోటల్ గా మార్చారని బృహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పోలీసులకు సోనూ సూద్ లిఖితపూర్వకంగా పిర్యాధు చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై శరద్ పవార్ ను కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి.