చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం ఆపేసిన సంగతి తెలిసిందే.కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని మూతపడ్డాయ్.
సినిమాలు అన్ని ఆగిపోయాయి.కానీ టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ పెళ్లిళ్లు మాత్రం ఆగలేదు.
ఏం అనుకున్నారో తెలీదు కానీ 2020లో మాత్రం టాలీవుడ్ సెలబ్రెటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకున్నారు.అలా ఎవరెవరు చేసుకున్నారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
దిల్ రాజు.
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని మే 10వ తేదీన నిజామాబాద్ లో రెండో పెళ్లి చేసుకున్నారు.ఈ పెళ్లి అతి తక్కువమంది మధ్య జరిగింది.అందుకే దిల్ రాజు మొన్న పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రెటీస్ అందరిని పిలిచి పార్టీ ఇచ్చాడు.

హీరో నిఖిల్.
కరోనా వైరస్ లాక్ దేవన్ ఉన్న సరే అయన పెళ్లి ఆపలేదు.అప్పటికే ఆలస్యం అయ్యిందని భావించిన నిఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ షాలినిని పెళ్లి చేసుకున్నాడు.

రానా దగ్గుబాటి.
రానా దగ్గుబాటి.టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
అలాంటి ఈయన కూడా మిహీక బజాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కరోనా టైమ్ లో కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న హీరో ఈయన.
నితిన్.
సంవత్సరం ప్రారంభంలో నిశ్చితార్థం చేసుకున్న నితిన్ షాలిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అతి తక్కువమంది సెలబ్రెటీల మధ్య పెళ్లి చేసుకున్న ఈయన పెళ్ళికి అయన అభిమాన నటుడుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా వచ్చి అక్షింతలు వేసి వెళ్లారు.

కాజల్ అగర్వాల్.
కలువకళ్ల సుందరి.టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సైతం ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంది.
బిజినెస్ మ్యాన్ అయినా గౌతమ్ కిచ్లుని ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్.
నిహారిక కొణిదెల.
మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి ఈ నెల 9వ తేదీన ఎంతో అద్భుతంగా.అంగరంగ వైభవంగా జరిగింది.
డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటాలో మెగా హీరోల మధ్య ఈ పెళ్లి జరిగింది.

డైరెక్టర్ సుజీత్.
సాహో దర్శకుడు సుజీత్ సైతం ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు.ప్రవల్లిక అనే అమ్మాయిని ఈ ఆగష్టులో పెళ్లి చేసుకున్నాడు డైరెక్టర్ సుజీత్.
ఏ సంవత్సరం ఇంతమంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని ఉండరు.అంతలా సెలబ్రెటీలు అంతా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు.