పెళ్లిపత్రిక.ఇప్పడు అంటే కొత్త కొత్త స్టైల్స్ తో వస్తున్నాయ్ కానీ అప్పట్లో మాత్రం ఎవరికి పెళ్లి.ఎప్పుడు పెళ్లి అనేవి మాత్రమే ఉండేవి.ఇప్పుడు పెళ్లి పత్రికలు కొన్ని మట్టిలో పాతితే మొలకలు వస్తే మరికొన్ని పెళ్లి పత్రికలలో ఏకంగా మద్యం, స్టఫ్ అన్ని కలిపి ఇస్తున్నారు.
మరి కొన్ని పెళ్లి పత్రికలు అయితే టెక్నాలజీని ఉపయోగించి సరికొత్తగా ముందుకు తీసుకొస్తున్నారు.ఈ పెళ్లి పత్రికలు చాలదు అన్నట్టు ఇప్పుడు వీడియో ఇన్విటేషన్స్ కూడా వచ్చాయి.

అలా వచ్చిన పెళ్లి పత్రికల్లో ఎన్నో నెట్టింట వైరల్ కూడా అయ్యాయి.అయితే ఇప్పుడు పెళ్లి పత్రికలు వైరల్ అవ్వడం కామన్.కానీ ఒకప్పటి పెళ్లి పత్రికలు వైరల్ అవ్వడం అనేది మాములు విషయం కాదు మరి.సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న పెళ్లి పత్రికల్లో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ వి ఉన్నాయ్.అప్పట్లో పెళ్లి పత్రికలో ఏం అంత స్పెషలిటీ అని అనిపించినా అవి ఎన్టీఆర్ ల పెళ్లి పత్రికలు కాబట్టి వైరల్ గా మారాయ్.
ఎన్టీఆర్, బసవరమతారకం పెళ్లి నిశ్చయించినట్టు అందులో రాసి ఉంది.ఎన్టీఆర్ తండ్రి పేరు నందమూరి రామయ్య చౌదరి.1942 మే 2వ తేదీన బసవరమతారకం, ఎన్టీఆర్ పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది.అప్పట్లో కొట్టిచ్చిన పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి పత్రిక కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి పెళ్లి 2011 మే 5న ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది.ఇక్కడ గమనిస్తే ఇద్దరి ఎన్టీఆర్ ల పెళ్లిళ్లు మే నెలలోనే జరిగాయి.
మీరు గమనిచ్చారా?