కేసీఆర్‌ హామీలతో ఇండస్ట్రీకి ఎంత వరకు ఉపయోగదాయకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు థియేటర్ల ఓపెన్‌కు సంబంధించిన క్లీయర్‌ నిర్ణయాన్ని ప్రకటించింది.గత కొన్ని రోజులుగా రక రకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.

ఎట్టకేలకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రావడంతో థియేటర్ల యాజమాన్యాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.దానికి తోడు థియేటర్లకు వరాల జల్లును కేసీఆర్‌ ప్రకటించడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

థియేటర్ల పై ఉన్న విద్యుత్‌ బకాయిలను అన్నింటిని కూడా తొలగించబోతున్నారు.ఇక ఇష్టానుసారంగా సినిమా సినిమాకు టికెట్ల రేట్లను మార్చుకునే పద్దతికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయి.

కొత్త సినిమాలకు 100 నుండి ఏకంగా 250 వరకు రేటును పెంచుకునే వెసులు బాటును కల్పించడంతో ప్రతి ఒక్క థియేటర్‌కు కూడా ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Advertisement

కేసీఆర్‌ ప్రభుత్వం ఇంకా సినిమా రంగంపై పలు వరాలను గుప్పించింది.కేసీఆర్‌ ప్రభుత్వం చూపించిన ఉదార స్వభావంపై సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నారు.ఇక కేసీఆర్‌ హామీలతో ఇండస్ట్రీకి చాలా వరకు ఉపయోగ దాయకం అనడంలో సందేహం లేదు.

ముఖ్యంగా థియేటర్ల యాజమాన్యాలకు లక్షల్లో ఆర్థికభారం తగ్గబోతుంది.చిన్న సినిమాలకు జీఎస్టీని వెనక్కు ఇచ్చేస్తాం అంటూ ప్రకటించిన నేపథ్యంలో 10 కోట్ల లోపు బడ్జెట్‌ సినిమాలన్నింటికి కూడా ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన హామీలతో ఈ ఏడాదిలో మిగిలిన నష్టాల నుండి బయట పడే అవకాశం ఉందని.వచ్చే ఏడాది ఆరంభం నుండి థియేటర్లు పూర్తి స్థాయిలో నడిస్తే మళ్లీ కళకళ లాడే వాతావరణం కనిపిస్తుందని అంటున్నారు.

ఇండస్ట్రీకి మంచి రోజులు రాబోతున్నాయి.థియేటర్ల ముందు అభిమానులు రంగు పూసుకుని డాన్స్‌ లు చేసే రోజులు రాబోతున్నాయని అంతా నమ్మకంగా వెయిట్‌ చేస్తున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు